Mohan Babu: సన్నాఫ్ ఇండియా మూవీ విశేషాలను మోహన్ బాబు మీడియాతో పంచుకునే క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆ కామెంట్స్ ఏమిటో మోహన్ బాబు మాటల్లోనే.. ‘ఈ చిత్రం యువతరంతో పాటు అందరికీ నచ్చుతుంది. కథ అవసరం మేరకు ఇద్దరు అమ్మాయిల మధ్య ముద్దు సన్నివేశాలు కూడా చిత్రీకరించాం. వీటిని విష్ణు ఒప్పుకోలేదు. కానీ, కథ ప్రాధాన్యత మేరకు పెట్టాల్సి వచ్చింది. నాది చాలా వైవిధ్యమైన పాత్ర. డైలాగ్స్, ఎక్స్‌ప్రెషన్స్ అందరూ అభినందించేలా ఉంటాయి. నా పాత్రని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు’ అని మోహన్ బాబు చెప్పుకొచ్చాడు.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నుంచి రాబోయే ఈ చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’ పై ఎలాంటి అంచనాలు లేవు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. కాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18, 2022న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆశ్చర్యకరంగా మోహన్ బాబు ఈ చిత్రానికి స్క్రీన్ రైటర్ గా కూడా వర్క్ చేశారు.

Also Read: Mohan Babu: విష్ణు నో చెప్పి ఉంటే నేను ఓకే చెప్పవాడిని కాదు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..!
మరి మోహన్ బాబు రచనా శక్తి ఏ స్థాయిలో ఉందో చూడాలి. కాగా ఈ సినిమాలో శ్రీకాంత్, అలీ, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. పైగా ఈ సినిమాలో మోహన్ బాబు గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త లుక్ లో కనిపించబోతున్నారు.

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై విష్ణు మంచు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తోంది. అసలు మోహన్ బాబు సినిమాలకు ఓపెనింగ్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథయంలో ఈ సినిమా పరిస్థితి ఏమిటి అనేది చూడాలి.
Also Read: Mohan Babu: జగన్ మేలు చేస్తే.. ఆ క్రెడిట్ నాదే – మోహన్ బాబు.
[…] […]