Mohan Babu On Chiranjeevi: మోహన్ బాబు ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో విలన్ గా, కామెడీ విలన్ గా నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన హీరోగా మారి చాలా సినిమాల్లో హీరోగా నటించిన తనకంటూ ఒక మంచి ఇమేజ్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు. అందులో భాగంగానే ఆయన చేసిన చాలా సినిమాలు ప్లాప్ అవడంతో కెరియర్ పరంగా ఆయన చాలా వరకు డల్ అయ్యాడు. ఆయనకు రాఘవేంద్రరావు అల్లుడుగారు అనే ఒక సినిమాతో సూపర్ డూపర్ హిట్ ఇచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు ని ఇచ్చారు.ఇక రాఘవేంద్రరావు 1990లో మోహన్ బాబు ని పెట్టి తీసిన అల్లుడు గారు సినిమా హీరోగా మోహన్ బాబు కెరియర్ ని నిలబెట్టింది. నిజానికి ఈ సినిమాని రాఘవేంద్రరావు చిరంజీవితో చేద్దామని అనుకున్నాడు, కానీ చిరంజీవి మొదటగా ఈ కథ విని చేద్దాం అని చెప్పినప్పటికీ ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ సినిమా క్లైమాక్స్ లో హీరో జైలుకెళ్లడం లాంటి సీన్లు తీసేస్తే నేను ఈ సినిమా చేస్తానని అన్నాడు.
ఎందుకంటే అప్పుడున్న అతని ఫ్యాన్స్ అతను జైలుకెళ్లడం లాంటి సీన్స్ ని ఒప్పుకోరు అనే ఉద్దేశంతో చిరంజీవి అలా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే సినిమా స్టోరీ మొత్తం క్లైమాక్స్ తో డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ సీన్ చేంజ్ చేయడం కష్టమని రాఘవేంద్రరావు అనుకొని చిరంజీవిని కాదని ఆయన్ని పక్కన పెట్టేసి మోహన్ బాబు కి ఈ కథ చెప్పి మోహన్ బాబుతో సినిమా తీశాడు. అయితే ఇంతకుముందు వరస సినిమాలు ఫ్లాపు అవ్వడం తో మోహన్ బాబు తన ఆస్తులను సైతం అమ్ముకొని కొన్ని సినిమాలు చేశాడు అవి కూడా ప్లాప్ అవడంతో ఆయన కెరియర్ లో చాలా ఆస్తులను కూడా కోల్పోయాడు ఇక అలాంటి సమయంలో రాఘవేంద్ర రావు ఇలా అల్లుడుగారు అనే సినిమాతో ఆయనకు ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాని ఇచ్చి ఒక పది సంవత్సరాలపాటు మోహన్ బాబు కెరియర్ కి ఇబ్బంది లేకుండా చేశారు. దాంతో మోహన్ బాబు తను అమ్మిన ఆస్తులను కొనడంతో పాటు గా చాలా విద్యా సంస్థలను కూడా నెలకొల్పి ఆర్థికంగా కూడా చాలా స్ట్రాంగ్ అయ్యాడు. అయితే ఈ సినిమాతో తన స్టాండర్డ్ ఏంటో తెలుగు సినిమా ప్రేక్షకులకి చూపించాడు.
ఇక అనతి కాలంలోనే వరుసగా హిట్లు కొడుతూ ఆయన ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా ఎదిగాడు.ఇక ఆ తర్వాత రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన పెదరాయుడు సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఒకవేళ అల్లుడుగారు సినిమాని చిరంజీవి కనక చేసి ఉంటే చిరంజీవి ఖాతాలో మరో బిగ్గెస్ట్ హిట్ పడి ఉండేదని ఆయన అభిమానులు సైతం ఇప్పటికి చెప్పుకుంటూ ఉంటారు…