Homeఎంటర్టైన్మెంట్Mohan Babu Villain Role: మహేష్ అన్న కొడుకు మూవీలో విలన్ గా మోహన్ బాబు.....

Mohan Babu Villain Role: మహేష్ అన్న కొడుకు మూవీలో విలన్ గా మోహన్ బాబు.. రెమ్యూనరేషన్ ఎంతంటే!

Mohan Babu Villain Role: విలన్ గా కెరీర్ ని మొదలు పెట్టి ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో విలన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు(Manchu Mohan Babu), ఆ తర్వాత హీరో గా మారి ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ని అందుకొని, నిన్నటి తరం టాప్ 5 స్టార్ హీరోలలో ఒకడిగా నిలిచాడు. అయితే ఈమధ్య కాలం లో మోహన్ బాబు సినిమాలు ఆపేయడం వల్ల ఆయనలోని మహానటుడ్ని మిస్ అయిపోతున్నారు తెలుగు ప్రేక్షకులు. ఒకప్పుడు ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపిన స్టార్ హీరోలు ఇప్పుడు మార్కెట్ పోవడంతో విలన్స్ గా మారి సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా ప్రారంభించి చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ గా గడుపుతున్నారు. కానీ మోహన్ బాబు మాత్రం సినిమాలకు దూరం గా ఉండడం ఆడియన్స్ కి అసలు నచ్చడం లేదు.

ఈ విషయం ఆయన వరకు వెళ్లిందో ఏమో తెలియదు కానీ, ఇప్పుడు మళ్ళీ ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. నేచురల్ స్టార్ నాని(Natural Star Nani), శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్'(The Paradise) అనే చిత్రం లో మోహన్ బాబు విలన్ క్యారక్టర్ చేస్తున్నాడు. ఆయన క్యారక్టర్ లుక్ కి సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియా లో లీక్ అయ్యి బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే ఇప్పుడు మరో సినిమాలో విలన్ క్యారక్టర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మోహన్ బాబు. పూర్తి వివరాల్లోకి వెళ్తే సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) సోదరుడు, సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ(Ghattamaneni Jayakrishna) త్వరలోనే వెండితెర అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ చిత్రానికి RX 100, మంగళవారం వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా టాండన్ హీరోయిన్ గా నటించనుంది. ఆమెకు కూడా ఇది మొదటి సినిమానే. ఈ చిత్రం లో విలన్ గా మోహన్ బాబు నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. రీసెంట్ గానే మోహన్ బాబు ని డైరెక్టర్ అజయ్ భూపతి కలిసి కథ వినిపించగా, అది ఆయనకు చాలా బాగా నచ్చిందని, ముఖ్యంగా ఆయన క్యారక్టర్ ని వివరించిన విధానం, ఆ క్యారక్టర్ ఆర్క్ విపరీతంగా నచ్చడం తో వెంటనే మరో మాట ఆలోచించకుండా ఈ సినిమాలో విలన్ గా నటించేందుకు ఒప్పుకున్నాడని సమాచారం. అజయ్ భూపతి సినిమాల్లో హీరో మరియు విలన్ క్యారెక్టర్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. కాబట్టి మోహన్ బాబు కి ఆయన చాలా పవర్ ఫుల్ రోల్ రాసి ఉంటాడని ఊహించవచ్చు. ఇకపోతే ఈ సినిమా కోసం మోహన్ బాబు రెండు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసినట్టు సమాచారం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version