https://oktelugu.com/

Ram Gopal Varma: పాల్ పై మోడీ మర్డర్ ప్లాన్.. బయట పెట్టిన వర్మ

Ram Gopal Varma:  రామ్ గోపాల్ వర్మకు వివాదానికి విడదీయరాని సంబంధం ఉంది. వివాదం వర్మ నీడగా ఉంటుంది. ఆయన సినిమాలకు అదే ప్రధాన పెట్టుబడి. ఇక ఆయనకు వివాదమే ఎంటర్ టైన్మెంట్. అందుకే, ఈ సంచలన దర్శకుడు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటారు. పైగా తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పబ్లిసిటి చేస్తాడు. తాజాగా ఆయన కేఏ పాల్‌‌ ను టార్గెట్‌ చేశారు. తనను హత్య చేసేందుకు ప్రధాని మోడీ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 9, 2022 / 06:56 PM IST
    Follow us on

    Ram Gopal Varma:  రామ్ గోపాల్ వర్మకు వివాదానికి విడదీయరాని సంబంధం ఉంది. వివాదం వర్మ నీడగా ఉంటుంది. ఆయన సినిమాలకు అదే ప్రధాన పెట్టుబడి. ఇక ఆయనకు వివాదమే ఎంటర్ టైన్మెంట్. అందుకే, ఈ సంచలన దర్శకుడు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటారు. పైగా తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పబ్లిసిటి చేస్తాడు.

    Ram Gopal Varma

    తాజాగా ఆయన కేఏ పాల్‌‌ ను టార్గెట్‌ చేశారు. తనను హత్య చేసేందుకు ప్రధాని మోడీ పన్నాగం పన్నినట్లు కేఏ పాల్‌ వ్యాఖ్యానించిన ఓ వీడియోను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్_చేశారు. ఏది ఏమైనా వేడి వేడి రాజకీయ రణరంగంలో నవ్వుల వర్షం కురిపించిన ఘనత ఒక్క ‘కేఏ పాల్’కే దక్కింది. ‘నేను అలా ప్రధాని కాగానే, పాపం మన పవన్ కల్యాణ్‌ ని సీఎం చేసేద్దాం’ అంటూ కేఏ పాల్ తాజాగా కామెడీ చేసిన సంగతి తెలిసిందే.

    ఆ వీడియోను కూడా రీసెంట్ గా ట్వీట్ చేశాడు. ఇప్పుడు మరో వీడియోని షేర్ చేశాడు. మొత్తానికి వర్మ పాల్ ను మాత్రం వదలడం లేదు. సహజంగానే కేఏ పాల్ చేష్ట‌లు, హావ‌భావాలు, ప్ర‌క‌ట‌న‌లు కామెడీకి పరాకాష్టగా ఉంటాయి. వాటికీ తోడు పాల్ కూడా ఈ మధ్య మరీ కామెడీ చేస్తూ కాలాక్షేపం చేస్తున్నాడు. ఆ కామెడీని వర్మ అందరికి పంచుతున్నాడు.

    ఏది ఏమైనా వర్మ – పాల్ ఇలా ఇద్దరూ ఉండాల్సిన వ్యక్తులే. ఇద్దరూ ఒకరికి మించిన వాళ్ళు ఒకరు. పది లక్షల బడ్జెట్ తో వివాదాస్పద సినిమా తీసి కోట్లు రాబట్టడం వర్మ మార్కెట్ మంత్రం. తన స్వార్థం కోసం ఇతరుల జీవితాలతో పేకాడుకుంటారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సినిమాలు తీసి పబ్బడం గడుపుకుంటారు.

    Ram Gopal Varma

    తన స్వలాభం కోసం ఆడపిల్లల మానం, అభిమానంపై కూడా సినిమాలు తీసి క్యాష్ చేసుకుంటాడు. ఇక తనకు ఫీలింగ్స్ లేవని, నా సుఖం నాదే. నా స్వార్ధం నాదే అంటాడు. ‘తల్లీ చెల్లీ ఏ గల్లీలో లేని సిల్లీ నా కొడుకుని’ అని మోహన్ బాబు చెప్పిన డైలాగ్ వర్మకు వంద శాతం వర్తిస్తుంది. ఇక పాల్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు అనుకోండి.

    Tags