https://oktelugu.com/

మన హీరోలకు ప్రధాని అభినందనలు

కరోనా విలయతాండవం చేస్తున్న వేళ మన తెలుగు సినిమా పరిశ్రమ విపరీతంగా స్పందిస్తోంది మన హీరోలు విరాళాల తో ఆర్ధిక సహకారం అందించడం తో పాటు వివిధ మాధ్యమాల ద్వారా కరోనా నివారణ చర్యల ప్రకటనలతో ప్రజల్ని చైతన్య పరుస్తున్నారు .కరోనా వైరస్ ని ఎదుర్కునేందుకు తెలుగు సినీ పరిశ్రమ చేస్తున్న కృషి యావత్ భారత దేశం గుర్తిస్తోంది. చివరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలుగు హీరోల కృషిని గుర్తించడం జరిగింది. . ప్రస్తుతం […]

Written By: , Updated On : April 4, 2020 / 02:25 PM IST
Follow us on


కరోనా విలయతాండవం చేస్తున్న వేళ మన తెలుగు సినిమా పరిశ్రమ విపరీతంగా స్పందిస్తోంది మన హీరోలు విరాళాల తో ఆర్ధిక సహకారం అందించడం తో పాటు వివిధ మాధ్యమాల ద్వారా కరోనా నివారణ చర్యల ప్రకటనలతో ప్రజల్ని చైతన్య పరుస్తున్నారు .కరోనా వైరస్ ని ఎదుర్కునేందుకు తెలుగు సినీ పరిశ్రమ చేస్తున్న కృషి యావత్ భారత దేశం గుర్తిస్తోంది. చివరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలుగు హీరోల కృషిని గుర్తించడం జరిగింది. .

ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి పరిస్థితి మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కాస్త తక్కువే అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం కరోనాను వ్యాప్తి కానివ్వకుండా గట్టి జాగ్రత్తలను తీసుకొంటోంది.

నిజానికి ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ని కొందరు సీరియస్‌గా తీసుకుంటుంటే, మరికొందరు మాత్రం తేలికగా తీసుకుంటున్నారు. అయితే కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నివారణ చర్యలకు మద్ధతుగా మన టాలీవుడ్ అందరికంటే ముందు నిలిచింది. కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న సందేశాన్ని ఓ పాట రూపంలో ” మెగా స్టార్ చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, సంగీత దర్శకుడు కోటి ” అందించారు . ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ ` మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు` అంటూ చిరంజీవి బృందానికి ప్రశంసలు అందించడం జరిగింది.