Rajamouli: తెర వెనక రాజమౌళి ఎలా ఉంటాడో తెలుసా..? హీరోలు రాజమౌళి చెప్పినట్టుగా ఎందుకు వింటారు..?

దర్శక ధీరుడు గా పేరుపొందిన రాజమౌళి ప్రస్తుతం అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ఇక ఆయన చేసే సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి...

Written By: Gopi, Updated On : July 22, 2024 3:28 pm

Modern Masters SS Rajamouli official trailer

Follow us on

Rajamouli: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన ఒకే ఒక్క దర్శకుడు రాజమౌళి… దర్శక ధీరుడిగా పేరు పొందిన ఈయన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని తన సినిమాల ద్వారా అలరిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా మహేష్ బాబుతో పాన్ వరల్డ్ లో ఒక భారీ సినిమాను కూడా తీయబోతున్న విషయం మనకు తెలిసిందే… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ప్రముఖ హీరోలు డైరెక్టర్ల మీద ఒక డాక్యుమెంటరీ సీరీస్ లను ప్లాన్ చేస్తున్నారు. ఇక నార్మల్ ఇంటర్వ్యూ లో అయితే ఆయా హీరోలు, దర్శకులకు సంబంధించిన కొన్ని మాటలను మాత్రమే చెబుతూ ఉంటారు. ఇక అవి మినహా ఇస్తే వాళ్ళకి సంభందించిన పూర్తి వివరాలు అనేవి బయట పడటం లేదు. ఇక దానికోసమే కొంతమంది కి సంభందించిన డాక్యుమెంటరీ సిరీస్ లను నెట్ ఫ్లిక్స్ తయారు చేయిస్తుంది. ముఖ్యంగా మాడరన్ మాస్టర్స్ అనే పేరుతో నిర్వహించిన డాక్యుమెంటరీ సిరీస్ లో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అయిన రాజమౌళి మీద ఒక ఎపిసోడ్ ను రూపొందించారు. ఇక రాజమౌళి తెర వెనక ఎలా ఉంటాడు అనే విషయాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ దీన్ని రూపొందించారు. ఇక దానికి సంభందించిన ట్రైలర్ ను కూడా ఈ రోజు రిలీజ్ చేశారు…జేమ్స్ కామెరూన్, కీరవాణి రామ్ చరణ్, ఎన్టీయార్, రమా రాజమౌళి, కరణ్ జోహార్ లాంటి వాళ్ళు పంచుకున్న విషయాలు ఇందులో భాగం కాబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇందులో రాజమౌళికి సంబంధించిన చాలా విషయాలు డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఎంత పెద్ద స్టార్ హీరో అయిన సినిమాకోసం రాజమౌళి దగ్గర ఎలా సరెండర్ అవుతారు. ఆయన వాళ్ళని ఎలా తనకు అనుకూలంగా మార్చుకొని సినిమా చేయగలుగుతాడనే విషయాలను తెలియజేస్తూనే ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఇష్టపడుతున్నారో రాజమౌళి ఎలా ఊహించగలుగుతున్నాడు. అనే విషయాలను కూడా ఇందులో ప్రస్తావించబోతున్నారు. అలాగే ఒక కథని బాగా నమ్మినవాడు గొప్పవాడు అవుతాడు అంటూ రాజమౌళి చెప్పిన ఒక విషయాన్ని కూడా ఇందులో హైలైట్ చేసి చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రెండు నిమిషాల ట్రైలర్ కే ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంటే ఇక ఆ ఎపిసోడ్ కి ఎంత మంచి క్రేజ్ వస్తుందో చూడాలి…

ఇక ఈ సిరీస్ ను అనుపమ్ చోప్రా తో పాటుగా సమీర్ నాయర్, దీపక్ సెహగల్ లాంటి వారు నిర్మించారు…అలాగే ఛాన్స్ రాఘవ్ కి డైరెక్షన్ చేసే అవకాశం దక్కింది….ఇక ఇప్పుడు దర్శక ధీరుడు అయిన రాజమౌళి యొక్క డాక్యుమెంటరీ సిరీస్ ని చూడడానికి యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తి ఎదురు చూస్తుంది. నిజానికి ఇంతకుముందు కూడా యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లతో డాక్యుమెంటరీ సిరీస్ ని ప్లాన్ చేసినప్పటికీ అది అంత బాగా క్లిక్ అయితే కాలేదు. కానీ రాజమౌళి ఎపిసోడ్ మాత్రం వరల్డ్ వైడ్ గా చాలా బాగా క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక నెట్ ఫ్లిక్స్ లాంటి ఒక పెద్ద సంస్థ తెలుగు దర్శకుడైన రాజమౌళి లాంటి ఒక దిగ్గజ దర్శకుడి మీద అలాంటి డాక్యుమెంటరీ సిరీస్ ను ప్లాన్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. మన తెలుగువాడైన రాజమౌళికి ఇలాంటి గౌరవం దక్కినందుకు మనందరం గర్వం గా ఫీల్ అవ్వాలి. రాజమౌళి ముందు ముందు ఇంకా చాలా రికార్డ్ లను బ్రేక్ చేయాలని అలాగే చాలా ఉన్నత స్థాయి కి వెళ్ళాలని కోరుకుందాం…