Mobile Phones: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ చాలా దారుణంగా తయారైంది. బడ్జెట్ భారీగా పెరిగిపోవడం దానికి తగ్గట్టుగా జనాలు థియేటర్ కి వచ్చి సినిమాలు చూడకపోవడం లాంటివి చేయడంతో సినిమాలను చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్లు భయపడిపోతున్నారు. ఎందుకంటే పెట్టిన బడ్జెట్ కూడా రికవరీ అవుతుందనే గ్యారెంటీ అయితే లేదు. ఇక దానికి తోడుగా ఓటిటి సంస్థలు విజృంభించడం తో థియేటర్ల పని అయిపోయింది. ఇక ప్రొడ్యూసర్లు సైతం ఓటిటి సంస్థలు చెప్పిన డేట్ కే తమ సినిమాలను రిలీజ్ చేసుకోవాల్సిన ఒక దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది…దానికి తోడుగా ఈ ఓటిటి సంస్థలు సబ్స్క్రిప్షన్ తీసుకున్న జనాలు తమ మొబైల్ ఫోన్ లోనే సినిమాలను చేస్తు తమకు ఇష్టం వచ్చినప్పుడు సినిమాలను చూడొచ్చు అనే ఒక ధోరణిలో ఉన్నారు. కాబట్టి థియేటర్ కి వెళ్లి ఆ మూడు గంటల సమయాన్ని వృధా చేసే కంటే ఓటిటి లో అయితే తమకు వీలైన సమయంలో ఆ సినిమాని చూడొచ్చు కదా అనే ఒక అభిప్రాయంలో అయితే ప్రేక్షకులు ఉన్నారు. దానివల్ల థియేటర్ కి రావాలనే ఆలోచన కూడా వాళ్ళు చేయడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో మొబైల్ ఫోన్స్ కూడా సినిమాలని చంపేస్తున్నాయి.
Also Read: ప్రభాస్ పెళ్లి చెడగొట్టింది ఎవరు..? అందుకే ఆయన ఇక మ్యారేజ్ చేసుకొనని డిసైడ్ అయ్యాడా..?
ఎందుకంటే ఇంతకు ముందు ప్రేక్షకులు తమ ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్లి ఎంజాయ్ చేయాలి అని అనుకునేవాళ్లు కానీ ఇప్పుడు అన్ని సినిమాలు మొబైల్ లోనే దొరుకుతుండడం వల్ల ఫోన్ ఆన్ చేసి సినిమాలను చూసుకుంటున్నాడు. తద్వారా మొబైల్ ఫోన్లు కూడా సినిమాలను చంపేస్తున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇక వీలైనంత తొందరగా వీటికి చెక్ పెడితే పర్లేదు లేకపోతే మాత్రం సినిమా ఇండస్ట్రీ భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది. ప్రతి హీరో దర్శకుడు సైతం తమ రెమ్యూనరేషన్స్ తగ్గించుకొని సినిమాలను చేసి టికెట్ రేట్లు తగ్గించి థియేటర్లో రిలీజ్ చేయాలి. అలాగే ఓటిటి సంస్థలకు సైతం సినిమా రిలీజ్ అయిన నెలరోజుల తర్వాత వాళ్ళ సినిమాలను ఓటిటి లో రిలీజ్ చేసుకోవాలనే కండిషన్ ని పెట్టాలి.
లేకపోతే సినిమా రిలీజ్ అయిన వారానికే ఓటిటి లోకి వస్తుంటే ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమాని ఎలా చూస్తారు… వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సినిమా ఇండస్ట్రీ పెద్దలు కొన్ని కండిషన్స్ పెట్టుకుంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…