https://oktelugu.com/

MLA Roja Daughter Anshu Malika : రోజా కూతురు గురించి షాకింగ్ విషయాలు ?

MLA Roja Daughter Anshu Malika : మాజీ హీరోయిన్, ప్రజెంట్ ఎమ్మెల్యే రోజా కూతురు ‘అన్షు మాలిక’ తెలుగు తెర పై  రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంది అంటూ గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు వాస్తవాలు వాస్తవానికి తెలియకముందే,  రూమర్లు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే, వీటన్నిటికి క్లారిటీ ఇస్తూ  ‘అన్షు మాలిక’ గురించి, ఆమె వ్యక్తిగత జీవితం గురించి,  ఆమె భవిష్యత్తు ఆలోచనల గురించి  ఎవరికీ  […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 6, 2022 / 08:35 AM IST
    Follow us on

    MLA Roja Daughter Anshu Malika : మాజీ హీరోయిన్, ప్రజెంట్ ఎమ్మెల్యే రోజా కూతురు ‘అన్షు మాలిక’ తెలుగు తెర పై  రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంది అంటూ గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు వాస్తవాలు వాస్తవానికి తెలియకముందే,  రూమర్లు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే, వీటన్నిటికి క్లారిటీ ఇస్తూ  ‘అన్షు మాలిక’ గురించి, ఆమె వ్యక్తిగత జీవితం గురించి,  ఆమె భవిష్యత్తు ఆలోచనల గురించి  ఎవరికీ  తెలియని విషయాలు  మీ కోసం.            

    MLA Roja Daughter Anshu Malika

    విత్తనం ఒకటి అయితే చెట్టు మరొకటి అవ్వదు కదా..  అన్షు మాలిక కూడా తన తల్లి రోజా హావ భావాలను, అందచందాలను, ప్రతిభ పట్టుదలను పుణికిపుచ్చుకుంది. అందుకే అన్షు మాలిక ఇప్పటికే కొన్ని అరుదైన గౌరవాలను సొంతం చేసుకుంది.  ‘ఇన్ఫ్లూయెన్స్ యూకే మ్యాగజైన్’ కవర్ పై  అన్షు మాలిక ఫోటోను కూడా ప్రచురించారు. 

     

    అన్షు మాలిక  గురించి ఎవరికి తెలియని విషయం ఏమిటంటే.. ఆమె  రైటర్ గా, ప్రోగ్రామర్ గా,  ఎంటర్ ప్రెన్యూర్ గా కూడా సత్తా చాటారు. అందుకే.. పిన్న వయసులోనే  యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపిక అయ్యి.. ఆ అవార్డును కూడా సొంతం చేసుకుంది.  అన్షు మాలిక చిన్న తనం నుంచి గొప్ప ప్రతిభను కనబరుస్తూనే ఉంది. 

    ఆమె స్కూల్ నుంచి కాలేజీ వరకు తన క్లాస్ లో అన్షు మాలికనే ఫస్ట్. అందుకే  ‘బర్న్ అచీవర్ మ్యాగజైన్’ కూడా  అన్షు మాలిక గురించి రాస్తూ  ‘ఆమె క్వీన్ ఆఫ్ టాలెంట్’ అని పేర్కొంది. పైగా తమ బుక్ కవర్ పేజీ పై  ‘అన్షు మాలిక’ ఫుల్ ఫోటోను ఘనంగా  ప్రచురించింది.   

     

    ఇంతకీ, రోజా కూతురు భవిష్యత్తు ప్లాన్స్ ఏమిటి ? 

     అన్షు మాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది అంటూ గత కొన్ని నెలలుగా  వార్తలు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. అయితే,  అన్షు మాలికకి సినిమాల పై ఆసక్తి లేదు. ఆమె కూడా తన తల్లి రోజా లాగే రాజకీయాల్లో రాణించాలని ఆశ పడుతుంది. అందుకే, తనకు తన తల్లే  స్ఫూర్తి నిరుప‌మానం అని.. తన తల్లి ప‌ట్టుద‌లే  తనకు  భవిష్యత్తు లక్ష్యం అంటుంది అన్షు. 

    ఇండస్ట్రీలో నటిగా, రాజకీయాల్లో ఎమ్మెల్యేగా రోజాకు ప్రతిభ గురించి,  ఆమె ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి రోజా లాగే, రోజా కుమార్తె కూడా సక్సెస్ కావాలని ఆశిద్దాం.