Homeఎంటర్టైన్మెంట్Star Hero: స్టార్ హీరోకి గుండెనొప్పి... హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

Star Hero: స్టార్ హీరోకి గుండెనొప్పి… హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

Mithun Chakraborty:  హీరో మిథున్ చక్రవర్తి అనారోగ్యానికి గురయ్యారు. నేడు ఉదయం(ఫిబ్రవరి 10)ఆయనకు ఛాతి నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు కలకత్తాలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. మిథున్ చక్రవర్తికి అత్యవసర విభాగంలో చికిత్స జరుగుతుంది. ఈ క్రమంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. గతంలో మిథున్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడ్డాడు. బెంగుళూరు లోని ప్రైవేట్ ఆసుపత్రిలో మిథున్ చక్రవర్తికి ఆపరేషన్ జరిగింది.

కోలుకున్న మిథున్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మిథున్ 1976లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆయన మొదటి చిత్రం మ్రిగయా. ఇది బెంగాలీ చిత్రం కాగా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రంలో నటనకు మిథున్ చక్రవర్తి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. డెబ్యూ మూవీతో నేషనల్ అవార్డు అందుకున్న మొదటి హీరో మిథున్ కావడం విశేషం.

కెరీర్ బిగినింగ్ లో మిథున్ సపోర్టింగ్ రోల్స్ చేశారు. ఆయన సోలో హీరోగా చేసిన సురక్ష భారీ విజయం సాధించింది. క్రైమ్ థ్రిల్లర్ సురక్ష చిత్రంలో మిథున్ సిబిఐ ఆఫీసర్ రోల్ చేశారు. ఇక మిథున్ చక్రవర్తి డిస్కో డాన్సర్ మూవీ తో స్టార్ హీరో అయ్యారు. ఆ మూవీ విపరీతమైన ఇమేజ్ తెచ్చిపెట్టింది. డిస్కో డాన్సర్ ఇండియాలో కంటే విదేశాల్లో ఎక్కువ ఆదరణ పొందింది. రూ. 100 కోట్ల వసూళ్లు సాధించిన మొదటి ఇండియన్ మూవీ డిస్కో డాన్సర్ కావడం విశేషం.

మిథున్ డాన్సులకు కుర్రకారు ఫిదా అయ్యారు. వివాదాస్పద చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్ లో మిథున్ కీలక రోల్ చేశారు. గత ఏడాది ఆయన ప్రధాన పాత్రలో కాబూలీ వాలా టైటిల్ తో ఒక బెంగాలీ చిత్రం విడుదలైంది. మిథున్ 1979లో నటి హెలెనా ల్యూక్ ని వివాహం చేసుకున్నారు. పెళ్ళైన నాలుగు నెలలకే వీరు విడిపోయారు. అనంతరం నటి యోగితా బాలిని పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం.

RELATED ARTICLES

Most Popular