Mission Chapter 1 Review: ఆ మధ్య రణ్ బీర్ కపూర్, రష్మిక నటించిన యానిమల్ మూవీ ఎంత సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ బాలీవుడ్ ఆ సినిమాను మర్చిపోలేదు. సోషల్ మీడియాలో ఎక్కడో ఒకచోట ఆ సినిమాకు సంబంధించిన సన్నివేశం కనిపిస్తూనే ఉంది. పాటలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అలాంటి యానిమల్ కు ఫిమేల్ వెర్షన్ లాంటి సినిమా ఒకటి ఓటీటీ లో అదరగొడుతోంది. సైలెంట్ గా స్ట్రీమింగ్ లోకి వచ్చి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
తమిళంలో జనవరి నెలలో అమీ జాక్సన్, అరుణ్ విజయ్ హీరో హీరోయిన్లుగా మిషన్ చాప్టర్ 1 పేరుతో యాక్షన్ ఎంటర్టైనర్ విడుదలైంది. దాదాపు ఆరు సంవత్సరాల వీరమని తర్వాత అమీ జాక్సన్ హీరోయిన్ గా తమిళ ఇండస్ట్రీలోకి ఈ సినిమా ద్వారా పున :ప్రవేశం చేసింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. కథలో కొత్తదనం ఉన్నప్పటికీ ప్రేక్షకులను అంతగా అలరించలేదు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకుల కోసం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాకు ఏఎల్ విజయ్(అమలాపాల్ మాజీ భర్త) దర్శకత్వం వహించారు. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆ కథకు తగ్గట్టుగానే ఈ యాక్షన్ సన్నివేశాలు జోడించారు. తండ్రి కూతుళ్ళ అనుబంధం ప్రధానంగా ఈ సినిమా కథ సాగుతుంది. ఆస్పత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న కూతురును కలుసుకునేందుకు ఓ తండ్రి ఖైదీగా ఎందుకు మారాడు? ఆమెను చివరికి కలుసుకున్నాడా? అతడు ఖైదీగా మారడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? ఈ అంశాల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. యాక్షన్ సన్నివేశాలు కూడా జోడించాడు. ప్రారంభ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. అదే టెంపోనూ కొనసాగించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అరుణ్ విజయ్ పాత్ర బాగున్నప్పటికీ.. దాన్ని దర్శకుడు సరిగా డిజైన్ చేయలేకపోయాడు. ఇక అమీ జాక్సన్ కొన్ని కొన్ని సన్నివేశాల్లో తేలిపోయింది. దీంతో ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణను పొందలేకపోయింది.
అమెజాన్ ప్రైమ్ ఏ సినిమాలో తెలుగు వెర్షన్ లో స్ట్రీమ్ చేస్తానని ప్రకటించినప్పటికీ.. కేవలం తమిళం వరకే అయిపోయింది. అయితే త్వరలో తెలుగు వెర్షన్ కూడా విడుదల చేస్తామని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఈ సినిమాలో అమీ జాక్సన్ పోలీస్ పాత్రలో ఆకట్టుకుంది. అయితే సినిమా కథను దర్శకుడు అర్థమయ్యేలాగా చెప్పడంలో విఫలమయ్యాడు. దీంతో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. ఇక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు సినిమాను గుర్తుకు తెస్తాయి. కొన్ని కొన్ని పెద్దలు చూసే సన్నివేశాలు కూడా ఉన్నాయి. దర్శకుడు కథపై కాస్త దృష్టి సారిస్తే సినిమా మరో రేంజ్ లో ఉండేది. అయినప్పటికీ వీకెండ్ కాలక్షేపం కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు.