https://oktelugu.com/

Miss Shetty Mrs Polishetty Collections : మిస్ శెట్టి మిసెస్ పోలిశెట్టి 3వ రోజు కలెక్షన్స్… అసలు ఊహించలేదు!

ఓవరాల్ గా మొదటి మూడు రోజుల్లో ఇండియా వైడ్ గా 7 . 78 కోట్ల నెట్ సాధించి బ్రేక్ ఈవెన్ మార్క్ కి దగ్గరైంది.

Written By:
  • NARESH
  • , Updated On : September 10, 2023 / 03:46 PM IST

    Miss Shetty Mr Polishetty Collections

    Follow us on

    Miss Shetty Mrs Polishetty Collections : ఒక భారీ డైనోసార్ లాంటి మూవీ వచ్చి మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని దూసుకెళ్తున్న సమయంలో మరో యావరేజ్ సినిమా ఎదురు నిలబడి మంచి వసూళ్లు సాధించటం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమా అదే పని చేస్తుంది. జవాన్ లాంటి సినిమా ముందు ఈ శెట్టీస్ సినిమా నిలబడి వసూళ్లు సాధిస్తుంది.

    నిజానికి ఈ సినిమాకు పెద్దగా పాజిటివ్ టాక్ అయితే రాలేదు. కాకపోతే అనుష్క నటన, నవీన్ పోలిశెట్టి మార్క్ కామెడీ తోడు కావడంతో అటు యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. దీనితో వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. మొదటి రెండు రోజులు 4 . 6 కోట్లు నెట్ వసూళ్లు చేసిన ఈ సినిమా మూడో రోజు ఏకంగా 3 .15 కోట్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటింది. మొదటి రోజు తో పోల్చితే దాదాపు 80 లక్షలు ఎక్కువ వసూళ్లు చేసింది ఈ సినిమా.

    ఓవరాల్ గా మొదటి మూడు రోజుల్లో ఇండియా వైడ్ గా 7 . 78 కోట్ల నెట్ సాధించి బ్రేక్ ఈవెన్ మార్క్ కి దగ్గరైంది. ఇక ఓవర్శిస్ విషయానికి ఇప్పటికే 800K డాలర్స్ క్రాస్ చేసిన ఈ సినిమా వన్ మిలియన్ క్లబ్ లోకి అడుగుపెట్టబోతోంది. ఈ విధంగా చూసుకుంటే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి పెర్ఫామెన్స్ ఇస్తుందనే అనుకోవాలి. ముఖ్యంగా లాంగ్ వీకెండ్ ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది.

    మరోపక్క తెలుగు లో జవాన్ సినిమా మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ కావడం పైగా హిందీ హీరో షారుఖ్ ఖాన్ కావడంతో తెలుగు జనాలు చూపు ఈ సినిమా మీద పడింది. ఇలా కొన్ని ప్లస్ పాయింట్స్ తోడుకావడంతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కమర్షియల్ హిట్ గా నిలిచింది. నిజానికి ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడ కూడా స్వీటీ అనుష్క కనిపించలేదు. బహుశా ఆమె మెయిన్ లైన్ లోకి వచ్చి ఉంటే ఈ చిత్రం కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉండేది. కేవలం నవీన్ పోలిశెట్టి మాత్రమే ప్రొమోషన్స్ బరువు మోశాడు.