Miss Shetty Mr Polishetty Review: సినీ ప్రేక్షకులు ఈమధ్య కంటెంట్ బాగుంటునే సినిమా చూస్తున్నారు. అందుకే చాలా మంది డైరెక్టర్లు కొత్త కథలతో సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అనుష్క, నవీన్ పోలిశెట్టి నటించిన ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ సినిమా సెప్టెంబర్ 7న థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
నటీనటులు:
అనుష్క శెట్టి,
నవీన్ పోలిశెట్టి
మురళీ శర్మ
అభినవ్ గౌతమ్
నాజర్
సోనియా దీప్తీ
జయసుధ
తెలసి
భద్రం
సాంకేతిక వర్గం:
డైరెక్టర్: మహేష్ బాబు పాచిగొల్ల
నిర్మాత: వి. వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
మ్యూజిక్: రాడన్, గోపి సుందర్
సినిమాటోగ్రఫీ: నీరవ్ శా
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్ రావు
కథ : అన్విత రవళి శెట్టి (అనుష్క) లండన్ లో చెఫ్. ఆమె పెళ్లి చేసుకోవడం లేదని తల్లి (జయసుధ) బాధపడుతుంది. అయితే పెళ్లిపై అన్వితకు సరైన భావన ఉండదు. ఈ సమయంలో అన్విత తల్లి చనిపోతుంది. తనకు తోడు ఉండాలని పెళ్లి చేసుకోకుండానే తల్లిని కావాలనుకుంటుంది. గర్భం కోసం స్టాండ్ ఆఫ్ కమెడియన్ సిద్ధు పొలిశెట్టి (నవీన్ పోలిశెట్టి)ని ఎంచుకుంటుంది. అయితే అప్పటికే అన్వితను ప్రేమించిన సిద్ధు ఆమె ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుందో తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. అలాగే సాంప్రదాయేతర వివాహానికి సిద్ధూ ఒప్పుకుంటాడా? అనేది కథాంశం.
విశ్లేషణ: కొత్త కాన్సెప్టు తో సినిమా ఆకట్టుకుంటుంది. ప్రధానంగా ఇందులో కామెడీ, ఎమోషన్స్ ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్తాయి. టైమింగ్ కామెడీతో నవీన్ శెట్టి కామెడీ ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంది. అయితే కొత్త ప్రేక్షకులకు ఫస్టాఫ్ పూర్తయితే గాని అర్థం కాదు. సెకండాఫ్ మాత్రం ఎక్కడా బోర్ లేకుండా ముందుకు సాగించారు. కొన్ని ఎమోషన్స్ కన్నీళ్లు పెట్టిస్తాయి. మరికొన్ని మాత్రం ఎందుకు పెట్టారు? అనేది అర్థం కాదు.
ఎవరెలా చేశారంటే?: అనుష్క నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో లీనమైపోతారు. అయితే ఇందులో అనుష్కను సన్నగా చూపించేందుకు వాడిన గ్రాఫిక్స్ బెడిసి కొట్టింది. ఆమెను నేచురల్ గా చూపించినా బాగుండేదని కొందరు అంటున్నారు. ఈ సినిమా అంతా నవీణ్ పోలిశెట్టి మరోసారి తన కామెడీతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఒక దశలో ఆయన మీదే సినిమా అధారపడిందన్నట్లుగా నటించారు. చాన్నాళ్ల తరువాత దసోనియా దీప్తి తెరపై కనిపించి సందడి చేసింది. అయితే తెలుగులో ఆకట్టుకోలేకపోయారు. తండ్రి పాత్రలో మురళీ శర్మ, తల్లి పాత్రలో జయసుధలు ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం ఎలా ఉందంటే?: డైరెక్టర్ కొత్త పాయింట్ ను చూపించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. అయితే క్యారెక్టరేజేషన్ ను ఎలివేట్ చేయడంలో కాస్త తడబడినట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. రధన్ పాటలు అస్సలు ఆకట్టుకోలేదు. బ్యాగ్రాండ్ మ్యూజిక్ పని తీరు కూడా అంతంత మాత్రంగానే ఉంది.
రేటింగ్ : 2.75/5