Miss Shetty Mr Polishetty Collections: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 6వ రోజు వసూళ్లు… అనుష్క మేనియాతో అలా!

మరోపక్క ఓవర్శిస్ లో కూడా అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ ముందుకు వెళ్తుంది. మొదటి ఐదు రోజుల్లోనే వన్ మిలియన్స్ డాలర్ క్లబ్ లోకి వెళ్ళింది ఈ సినిమా.

Written By: Shiva, Updated On : September 13, 2023 11:43 am

Miss Shetty Mr Polishetty Collections

Follow us on

Miss Shetty Mr Polishetty Collections: అనుష్క , నవీన్ పొలిశెట్టి కలిసి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని దానికి తగ్గట్లే వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తుంది. ఇటు తెలుగులోనూ అటు ఓవర్శిస్ లోను డీసెంట్ కలెక్షన్స్ కొల్లగొడుతుంది ఈ సినిమా. పక్క యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.

ఇక ఈ చిత్రం వసూళ్లు విషయానికి వస్తే మొదటి నాలుగు రోజులు దాదాపు 12. 5 కోట్ల నెట్ వసూళ్లు చేసి హౌరా అనిపించింది. ఇక కీలకమైన సోమవారం కూడా దాదాపు 1. 8 కోట్ల కలెక్షన్స్ చేసింది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా. అదే విధంగా ఆరో రోజు కూడా మంచి ఫ్లో లోనే వసూళ్లు కొనసాగాయని తెలుస్తుంది. మనకు వస్తున్న సమాచారం ప్రకారం మంగళవారం 1. 5 కోట్ల నెట్ సాధించింది ఈ చిత్రం.

మరోపక్క ఓవర్శిస్ లో కూడా అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ ముందుకు వెళ్తుంది. మొదటి ఐదు రోజుల్లోనే వన్ మిలియన్స్ డాలర్ క్లబ్ లోకి వెళ్ళింది ఈ సినిమా. ఇలాంటి సినిమాలకు ఓవర్శిస్ లో ఎప్పుడు మంచి ఆదరణే లభిస్తుందని మరోసారి రుజువు చేసింది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా. ఓవరాల్ గా ఇండియా లో ఈ చిత్రం ఇప్పటికే 15 కోట్లకు పైగా నెట్ వసూళ్లు చేసింది. ఫైనల్ రన్ లో ఈ సినిమా 22 టు 25 కోట్ల మార్క్ టచ్ చేసే అవకాశం ఉంది.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఇన్నాళ్లు ప్రచారానికి దూరంగా ఉంటున్న అనుష్క ఎట్టకేలకు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ప్రమోషన్ లో పాల్గొంటుంది. రీసెంట్ గా ఒక వీడియో సందేశం విడుదల చేసింది అనుష్క . అదే విధంగా ఈ సినిమాను కొన్ని చోట్ల మహిళలకు ఉచితంగా ప్రదర్శించబోతున్నారు. మరోపక్క కుదిరితే హీరోయిన్ అనుష్క అభిమానులతో కలిసి సందడి చేయడానికి థియోటర్ల కు వచ్చే అవకాశం ఉంది.