Devara 2: సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండే విధంగా చూసుకుంటున్నాడు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్కరికి చాలా మంచి అభిమానం అయితే ఉంటుంది. మరి ఆయన సాధించిన విజయాలు ఇప్పటివరకు ఏ నందమూరి హీరో కూడా సాధించకపోవడం విశేషం… అందుకే నందమూరి ఫ్యామిలీ బాధ్యతలు మొత్తాన్ని తనే తీసుకొని ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అన్నీ అతనికి గొప్ప ఐడెంటిటిని తీసుకొచ్చి పెట్టినవే కావడం వల్ల ఆయన చేస్తున్న ఈ సినిమాతో ఎలాంటి ఐడెంటిటి సంపాదించుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి గుర్తింపు రాబోతోంది అనేది కూడా తెలియాల్సి ఉంది. గత సంవత్సరం దేవర సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ఈ సంవత్సరం రీసెంట్ గా వచ్చిన వార్ 2 సినిమాతో ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయాడు. కారణమేంటి అంటే ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ పెద్దగా లేదు. దానికి తోడుగా దర్శకుడు ఈ సినిమాను కూడా ఎంగేజింగ్ గా తీయకపోవడం వల్ల ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పించలేకపోయిందనే చెప్పాలి…
Also Read: ‘మిరాయ్’ మూవీ మొట్టమొదటి రివ్యూ..సినిమాలో ప్లస్సులు,మైనస్సులు ఇవే!
ఇక కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమాకి సీక్వెల్ ఉంటుందంటూ గతంలో ప్రచారం అయితే జరిగింది. గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమా క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు వస్తున్నప్పటికి రీసెంట్ గా సినిమా యూనిట్ నుంచి ఒక వార్త బయటకు వచ్చింది.
‘దేవర 2’ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని 2026 జనవరి నుంచి ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలు మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇందులో భారీగా మార్పులు చేర్పులు చేశారట. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.
దాని కోసమే కథ విషయంలో ఆయన ఎక్కడ రాజీ పడకుండా చాలా ఎక్స్ట్రార్డినరీ కథని మలచలనే ఉద్దేశంతోనే ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ రేంజ్ లో ఎలివేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…