Mirai Collection Day 4: తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్'(Mirai Movie) రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. అయితే భారీ మొదటి వీకెండ్ వసూళ్ల తర్వాత ఈ సినిమాకు మొదటి సోమవారం అనేక ప్రాంతాల్లో వసూళ్లు బాగా పడిపోయాయి. అందుకు ఉదాహరణగా మనం బుక్ మై షో టికెట్ సేల్స్ ని తీసుకోవచ్చు. మొదటి మూడు రోజులు వరుసగా రోజుకి 3 లక్షలకు పైగా టికెట్స్ అమ్మకాలను నమోదు చేసుకుంటూ ముందుకెళ్లిన ఈ చిత్రం, నాల్గవ రోజున, అనగా మొదటి సోమవారం రోజున కేవలం 1 లక్షా 20 వేల టిక్కెట్లు అమ్ముడుపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొదటి వీకెండ్ లో వచ్చిన వసూళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ అనే చెప్పాలి.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి సోమవారం రోజున ఏకంగా 50 శాతం కి పైగా డ్రాప్స్ నమోదు అయ్యాయట. వాళ్ళ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో నాల్గవ రోజున కేవలం 3 కోట్ల 45 లక్షల రూపాయిలు మాత్రమే వచ్చింది. సిటీస్ లో డీసెంట్ ఆక్యుపెన్సీలను నమోదు చేస్తున్న ఈ చిత్రం, క్రింది సెంటర్స్ లో మాత్రం సోమవారం రోజున బాగా డ్రాప్ అయ్యిందట. ఆ కారణం చేతనే వసూళ్లు తగ్గాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా నాలుగు రోజులకు కలిపి ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 45 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 14 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా సీడెడ్ ప్రాంతంలో 3 కోట్ల 32 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం లో 2 కోట్ల 92 లక్షలు, తూరుపు గోదావరి జిల్లాలో రెండు కోట్లు , పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి 20 లక్షలు, గుంటూరు జిల్లాలో కోటి 80 లక్షలు, కృష్ణా జిల్లాలో కోటి 75 లక్షలు, నెల్లూరు జిల్లాలో 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక ప్రాంతం లో రెండు కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 5 కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ ప్రాంతం లో 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి నాలుగు రోజులకు కలిపి 81 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 44 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.