Mirai Movie 10 Days Collections: తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్'(Mirai Movie) విడుదలై అప్పుడే పది రోజులు పూర్తి చేసుకుంది. పదవ రోజు ఆదివారం కావడంతో, ఈ చిత్రానికి ఆడియన్స్ మరోసారి థియేటర్స్ లో పోటెత్తారు. బుక్ మై షో గణాంకాల ప్రకారం ఈ చిత్రానికి పదవ రోజున 91 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది సాధారణమైన విషయం కాదు. చాలా మీడియం రేంజ్ సినిమాలకు ఈ రేంజ్ లో మొదటి రోజు కూడా అమ్ముడుపోవడం కష్టమే. అలాంటిది ఈ సినిమాకు పదవ రోజున కూడా ఈ రేంజ్ టికెట్స్ సేల్ అయ్యాయి. చూస్తుంటే ఓజీ వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శితమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే పది రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరంగా చూద్దాం.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి పదవ రోజున తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 30 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఈమధ్య కాలం లో ఒక మీడియం రేంజ్ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు ఎప్పుడూ రాలేదు. అంతే కాదు ఓవర్సీస్ లో కూడా రెండవ వీకెండ్ ఈ చిత్రం మంచి గ్రాస్ వసూళ్లను నమోదు చేసుకొని ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. వాళ్ళ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి ఓవర్సీస్ లో 10 రోజులకు కలిపి 14 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 20 కోట్ల 50 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఉత్తరాంధ్ర లో 4 కోట్ల 30 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 2 కోట్ల 45 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో కోటి 50 లక్షలు, గుంటూరు జిల్లాలో రెండు కోట్ల 7 లక్షలు, కృష్ణ జిల్లాలో 2 కోట్ల 30 లక్షలు, నెల్లూరు జిల్లాలో కోటి 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఈ చిత్రానికి 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 67 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 123 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరో 5 కోట్ల రూపాయిల షేర్ ఎక్కువ రాబడితే ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 3 చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది.