Mirai First Week Collection: తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్'(Mirai Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వీకెండ్ తర్వాత ఈ చిత్రం చల్లబడుతుందేమో, లాంగ్ రన్ ఉండదు, భారీ రేంజ్ డ్రాప్స్ మొదటి సోమవారం నుండి వస్తాయని అంతా అనుకున్నారు. ఊహించిన స్థాయిలో డ్రాప్స్ అయితే రాలేదు కానీ, ఒక మోస్తారు డ్రాప్స్ అయితే కచ్చితంగా వచ్చాయి. నిన్న గాక మొన్న విడుదలైనట్టు అనిపిస్తున్న ఈ చిత్రం, అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది. మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అవలీల గా దాటేసిన ఈ చిత్రం, మొదటి వారం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
Also Read: ‘భద్రకాళి’ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా? ఫట్టా?
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నైజాం ప్రాంతం లో మొదటి వారం అక్షరాలా 17 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఫుల్ రన్ లో కచ్చితంగా 20 కోట్లకు పైగా షేర్ వసూళ్లను రాబడుతుందని బలంగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు. అదే విధంగా సీడెడ్ లో 4 కోట్ల 21 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఉత్తరాంధ్ర ప్రాంతం లో 3 కోట్ల 70 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 2 కోట్ల 20 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి 35 లక్షలు, గుంటూరు జిల్లా లో కోటి 92 లక్షలు, కృష్ణ జిల్లా లో కోటి 96 లక్షలు, నెల్లూరు జిల్లాలో 95 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 34 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 54 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా కర్ణాటక ప్రాంతం నుండి 3 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 7 కోట్ల 45 లక్షలు, ఓవర్సీస్ ప్రాంతం నుండి 11 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి మొదటి వారం లో 56 కోట్ల 74 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 103 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఎంత రన్ వచ్చినా ఇక కేవలం 5 రోజుల థియేట్రికల్ రన్ మాత్రమే ఈ చిత్రానికి ఉంటుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం వస్తుంది. అప్పుడు థియేటర్స్ మొత్తం ఆ సినిమాకు ఇచ్చేయాల్సి ఉంటుంది కాబట్టి, అప్పటి వరకు ఎంత వసూళ్లు వస్తే అంత అని అంటున్నారు. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం అయితే ఫుల్ రన్ లో ఈ సినిమా 70 కోట్ల మార్కుని కచ్చితంగా అందుకుంటుంది. అంటే ‘హరి హర వీరమల్లు’ క్లోజింగ్ ని దాటబోతుంది అన్నమాట.