Mirai 3 days Collections: తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నిర్మాతలు చెప్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకు ఈ సినిమాకు మూడు రోజుల్లో 81 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. తేజ సజ్జ లాంటి మీడియం రేంజ్ హీరో కి ఈ స్థాయి వసూళ్లు మొదటి వీకెండ్ లోనే రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల తర్వాత నేచురల్ స్టార్ నాని ఈ స్థాయి వసూళ్లను అందుకునే రేంజ్ కి వస్తే, తేజ సజ్జ మాత్రం కేవలం ఒకే ఒక్క హిట్ తో వాళ్ళ రేంజ్ కి చేరుకోవడం అరాచకమైన విషయం.
ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం అరుదైన రికార్డు ని నెలకోపింది. వరుసగా మూడు రోజులు నాన్ స్టాప్ గా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 8 కోట్ల రూపాయలకు తగ్గకుండా షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ మూడు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లోనే 46 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నిన్న ఇండియా వెర్సస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ప్రభావం ఈ సినిమా పై బలంగా పడుతుందని అనుకున్నారు. తెలుగు వెర్షన్ వసూళ్లపై ఎలాంటి ప్రభావం పడలేదు కానీ, హిందీ వెర్షన్ లో మాత్రం కాస్త ఎఫెక్ట్ పడింది. రెండవ రోజు ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను చూసి, కచ్చితంగా మూడవ రోజున 6 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబడుతుందని అంతా అనుకున్నారు. కానీ కేవలం 3 కోట్ల 91 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే నాల్గవ రోజునా వచ్చాయి.
అనుకున్న టార్గెట్ చేరుకోలేకపోయిన మొదటి రోజు కంటే రెండింతలు ఎక్కువ వసూళ్లు రావడం గతం లో పుష్ప 2 కి కూడా జరగలేదని, రాబోయే రోజుల్లో కచ్చితంగా ఇదే స్థాయి స్టడీ రన్ ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా హిందీ వెర్షన్ లో మూడు రోజులకు కలిపి 8 కోట్ల 66 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇదే రేంజ్ స్టడీ రన్ కొనసాగుతూ ముందుకు వెళ్తే మాత్రం కచ్చితంగా ఈ చిత్రం ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంతే కాదు నిన్నటితోనే ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. ఈరోజు నుండి వచ్చే వసూళ్లు మొత్తం లాభాలే.