https://oktelugu.com/

మతం ముసుగేసిన బాబు.. ఆయనకే రివర్స్‌ అయిందిగా!

టీడీపీలో కుల రాజకీయాలకు కొదువ లేదు. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుల,మత రాజకీయాలను నడపడంలో దిట్ట అని చెప్పొచ్చు. మొన్నటి వరకు కుల రాజకీయాలు నడిపిన బాబు.. ఇప్పుడు మతం ముసుగును వేసుకున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. Also Read: పోలవరం ముంపు: ఆ ఏడు మండలాలు మళ్లీ తెలంగాణకేనా..? ఇటీవల నంధ్యాలలో ఆటో డ్రైవర్‌‌ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు మతం రంగు పులుమాలని చూస్తున్నారు చంద్రబాబు. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 13, 2020 / 04:10 PM IST
    Follow us on

    టీడీపీలో కుల రాజకీయాలకు కొదువ లేదు. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుల,మత రాజకీయాలను నడపడంలో దిట్ట అని చెప్పొచ్చు. మొన్నటి వరకు కుల రాజకీయాలు నడిపిన బాబు.. ఇప్పుడు మతం ముసుగును వేసుకున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

    Also Read: పోలవరం ముంపు: ఆ ఏడు మండలాలు మళ్లీ తెలంగాణకేనా..?

    ఇటీవల నంధ్యాలలో ఆటో డ్రైవర్‌‌ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు మతం రంగు పులుమాలని చూస్తున్నారు చంద్రబాబు. ఈ ఘటనపై స్పందించిన ఆయన.. ఏకంగా ముస్లింలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందంటూ రెచ్చిపోయారు. అయితే.. ఇప్పుడు ఈ మత రాజకీయం కాస్త టీడీపీకి రివర్స్‌ అయింది. నిందితులకు బెయిల్ ఇప్పించింది చంద్రబాబు పార్టీ మనిషేననే విషయం వెలుగులోకి వచ్చింది.

    దీంతో ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు బాబు. ప్రభుత్వంపై బురద జల్లాలని చూసిన చంద్రబాబు చేతులకే మట్టి అంటుకున్నంత పని అయింది. అయితే.. ఇలాంటి మత పరమైన దాడులు చంద్రబాబు హయాంలోనూ జరిగాయి. దీంతో ప్రత్యర్థులు ఆ దాడులను ముందు పెడుతున్నారు. గతంలో గుంటూరులో నారా -హమారా పేరుతో జరిగిన సభలో ప్లకార్డులు పట్టుకున్న పాపానికి ముస్లిం యువకుల్ని అరెస్ట్ చేసి, పోలీసులతో కొట్టించారు. ఈ వ్యవహారం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. మైనార్టీ బాలికపై జరిగిన దారుణాన్ని ప్రశ్నించినందుకు గుంటూరులో పోలీసులు ముస్లిం యువకులపై దేశద్రోహం కేసు పెట్టిన వ్యవహారం కూడా గతంలో టీడీపీ చేసిన తప్పులను మరోసారి గుర్తు చేస్తోంది.

    Also Read: బీజేపీ నెక్ట్స్‌ టార్గెట్‌ తిరుపతి.. జనసేన ఏం చేస్తుంది?

    అంతేకాదు.. బాబు హయాంలో ఒక్క ముస్లింకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు ముస్లింలపై కపట ప్రేమ చూపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ముస్లింలకు వైఎస్సార్‌‌ ప్రకటించిన రిజర్వేషన్ల విషయంలోనూ చంద్రబాబు కోర్టు కేసులతో అడ్డుకున్నారు. దానిని కూడా ఎక్కుపెడుతున్నారు వైసీపీ నేతలు. అంటే ఎరక్కపోయి ముస్లింలపై ప్రేమ ఒలకబోసిన చంద్రబాబు.. ఇప్పుడు వారితోనే చీవాట్లు తింటున్నారు. అలాగే.. తిరుమల బ్రహ్మోత్సవాల వేళ బాబు చేసిన రాజకీయ కూడా రివర్స్‌ అయింది. ఇన్నాళ్లు హిందు-క్రైస్తవ మతాలను వాడుకున్న చంద్రబాబు, ఇప్పుడు హిందు-ముస్లిం అంటూ సమాజాన్ని రెండుగా విడదీయాలని చూస్తున్నారని ఆయన తప్పులను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్