Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవలే లైంగిక వేధింపుల కేసు లో అరెస్ట్ అయ్యి చంచల్ గూడా జైలులో చాలా కాలం వరకు రిమాండ్ లో కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయన మీద పోస్కో చట్టం క్రింద కేసు నమోదు అయ్యింది కాబట్టి బైలు రావడం కష్టం అని అందరూ అనుకున్నారు. కానీ నేరం ఇంకా రుజువు కాలేదు కాబట్టి ఆయనకీ కోర్టు రీసెంట్ గానే మధ్యంతర బైలు ని మంజూరు చేసింది. అంతకు ముందే ఆయనకి నేషనల్ అవార్డు అందుకునేందుకు కోర్టు నాలుగు రోజుల పాటు బైలుని మంజూరు చేసింది కానీ. పోస్కో చట్టం క్రింద కేసు నమోదు అవ్వడం వల్ల ఆయనకి నేషనల్ అవార్డు రద్దు అయ్యింది. దీంతో బాదపడ్డ జానీ మాస్టర్ తన బైలు ని రద్దు చేసుకున్నాడు.
ఆ తర్వాత రెగ్యులర్ బైలు కోసం దరఖాస్తు చేసుకోగా, పిటీషన్ ని స్వీకరించి విచారించిన హై కోర్టు, రీసెంట్ గానే ఆయనకి బైలు మంజూరు చేసింది. బయటకి వచ్చిన వెంటనే జానీ మాస్టర్ తన కుటుంబంతో ఎమోషనల్ గా గడిపిన సంఘటనలను వీడియో తీసి సోషల్ మీడియా లో తన అభిమానులతో పంచుకున్నాడు. దీనిపై కొంతమంది ఆయనకి సపోర్టు చేయగా, మరికొంత మంది ఎదో గొప్ప పని చేసి బయటకి వచ్చినట్టు ఈ అతి ఏమిటి అని విమర్శించారు. ఇదంతా పక్కన పెడితే నిన్న రాత్రి జానీ మాస్టర్ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న ఆయన నెల్లూరు కి వెళ్తుండగా నేషనల్ హై వే లో పిడుగురాళ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన జానీ మాస్టర్ వెంటనే తన కారుని ఆపి, ఘటన స్థలం వద్దకు వెళ్లి గాయపడిన వ్యక్తిని తక్షణమే మెడికల్ సపోర్టు కోసం ఆసుపత్రికి తరలించాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో షేర్ చేసుకుంటూ ‘దయచేసి రోడ్ల పై రాత్రు సమయంలో వేగంగా డ్రైవింగ్ చేయకండి. ఇంటికీ వెళ్లాలని మీ తలలో ఎన్ని ఆలోచనలు ఉన్నా సరే అలా చేయకండి, హెల్మెట్ ధరించడం అసలు మర్చిపోవద్దు’ అంటూ చెప్పుకొచ్చాడు.
జానీ మాస్టర్ ఇప్పుడు కొత్తగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం లేదు. మొదటి నుండి ఆయనది ఇలా నలుగురికి సహాయం చేయాలనే మనస్తత్వం ఉంది. ఎన్నో సందర్భాలలో చేసి ఇలా వీడియోలు సోషల్ మీడియా లో పంచుకున్నాడు. విజయవాడ లో వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాడు. కానీ ఇప్పుడు ఒక కేసు లో చిక్కుకొని పరువు పోయే పరిస్థితి వచ్చిన తర్వాత ఇలాంటి వీడియోలు షేర్ చేయడం తో నీకు పోయిన పరువుని వెనక్కి రప్పించుకోవడానికి చేస్తున్న జిమ్మిక్స్ లాగా అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మేము నెల్లూరు హైవేలో వెళుతుండగా పిడుగురాళ్ల దగ్గర జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతనికి వెంటనే మెడికల్ సపోర్టు ఇప్పించి ఆసుపత్రికి తరలించాము.
దయచేసి, రోడ్లపై రాత్రి పూట డ్రైవింగ్ చేసేటపుడు త్వరగా ఇంటికెళ్ళాలని మీ తలలో ఎన్ని ఆలోచనలున్నా సరే వేగంగా వెళ్ళకండి,… pic.twitter.com/8UjicwvM3E
— Jani Master (@AlwaysJani) October 27, 2024