Memu Famous Closing Collections: చిన్న సినిమాగా విడుదలై పెద్ద సూపర్ హిట్ సినిమాగా నిలవడం ఈమధ్య సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత ఇండస్ట్రీ లో అత్యధిక హిట్స్ సాధించిన సినిమాల లిస్ట్ ని ఒక్కసారి పరిశీలిస్తే పెద్ద సినిమాలకంటే ఎక్కువగా చిన్న సినిమాలే ఉన్నాయి. తక్కువ బడ్జెట్ తో కొత్తవాళ్లతో మంచి కథని ఎంచుకుంటే బోలెడంత డబ్బుని మూటగట్టుకుంటున్నారు మేకర్స్.
ఈ జాబితా లో చాయ్ బిస్కెట్ సంస్థ ముందు వరుస లో ఉంటుంది. ఈ ఏడాది ‘రైటర్ పద్మభూషణ్’ అనే సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్న ఈ సంస్థ నుండి వచ్చిన మరో సూపర్ హిట్ చిత్రం ‘మేము ఫేమస్’. సుమంత్ ప్రభాస్ అనే ఒక కుర్రాడు హీరో గా నటిస్తూ , దర్శకత్వం వహించిన ఈ సినిమా కి మొదటి రోజు ఓపెనింగ్ దగ్గర నుండి క్లోసింగ్ వరకు అందరినీ సర్ప్రైజ్ చేసింది.
ఈ చిత్రం లో కొన్ని సన్నివేశాలను ఫోన్ కెమెరా తో కూడా చిత్రీకరించామని సుమంత్ ప్రభాస్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా రెండు కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగింది. క్లోసింగ్ లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి ఆరు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది, షేర్ విలువ కచ్చితంగా మూడు కోట్ల రూపాయిల వరకు ఉంటుందని సమాచారం. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది కంటెంట్ వల్లే, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ ఈ సినిమా అనేది ఒకటి ఉందని తెలిసేలా చేసింది మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే.
సినిమా విడుదలకు ముందే ఆయనకీ చిత్రాన్ని చూపించారు ‘మేము ఫేమస్’ మేకర్స్. ఆయన ఎంతగానో నచ్చడం తో వెంటనే సినిమా చాలా బాగుంది అని ట్వీట్ వేసాడు.అప్పుడు ఈ చిత్రం వెలుగులోకి వచ్చింది, కమర్షియల్ గా కావాల్సినంత పుష్ చేసిందని మేకర్స్ సైతం చెప్పుకొచ్చారు.