Mehreen Pirzada marriage: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్ మెహ్రీన్ పిర్జాడా(Mehreen Pirzada). నేచురల్ స్టార్ నాయి హీరో గా నటించిన ‘కృష్ణా గాడి వీరప్రేమ గాఢ’ అనే చిత్రం ద్వారా ఈమె వెండితెర అరంగేట్రం చేసింది. తొలిసినిమా లో ఈమెని చూసిన ప్రతీ ఒక్కరు జూనియర్ కాజల్ అగర్వాల్ లాగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. కచ్చితంగా భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. ఇప్పటి వరకు ఈమె 23 చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అందులో కేవలం రాజా ది గ్రేట్, F2,F3 మరియు మహానుభావుడు చిత్రాలు మాత్రమే కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి. అయితే ఈమధ్య కాలం లో మెహ్రీన్ సినిమాలకు బాగా దూరమైంది. కొన్నాళ్ల క్రితం ఈమె బీజేపీ నాయకుడు భవ్య బిష్ణోయ్ తో ప్రేమాయణం నడిపి అతనితో నిశ్చితార్థం కూడా చేసుకుంది.
కానీ వాళ్ళిద్దరి మధ్య ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ, పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అప్పటి నుండి సింగిల్ గానే జీవితాన్ని లీడ్ చేస్తూ వచ్చింది మెహ్రీన్. అయితే రీసెంట్ గా ఈమె రహస్యంగా పెళ్లి చేసుకుంది అంటూ సోషల్ మీడియా లో వచ్చిన ఒక వార్త పెద్ద ప్రకంపనలు సృష్టించింది. ఈ వార్త మెహ్రీన్ వరకు చేరడం తో ఆమె తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యింది. ఆమె ఇచ్చిన ఈ రియాక్షన్ ని చూస్తుంటే, ఆమె కుటుంబ సభ్యులు ఈ రూమర్ ని నిజమని నమ్మినట్టు మనకి స్పష్టంగా అర్థం అవుతోంది. ఇంతకీ ఆమె ఏమని మాట్లాడిందంటే ‘ఈరోజుల్లో సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలను ప్రచారం చేయడమే కొంత మంది జర్నలిస్టుల వ్యాపకం అయ్యింది. డబ్బులు తీసుకొని ఇలాంటి పనికిమాలిన వార్తలు రాస్తూ రోజుకి రోజుకి వీళ్ళు జర్నలిజం కి ఉన్న విలువని తగ్గిస్తున్నారు’.
‘నేను రహస్యంగా పెళ్లి చేసుకున్నాను అని రెండేళ్ల క్రితం ఒక వార్త వచ్చింది. ఇలాంటివి పట్టించుకోని సమయం వృధా చేసుకోవడం ఎందుకని నేను దాని గురించి మాట్లాడలేదు. కానీ పదే పదే ఈ వార్తని ప్రచారం చేస్తూ నన్ను మానసిక వేదనకు గురి చేస్తున్నారు. అందుకే నేడు మాట్లాడాల్సి వస్తుంది. నేను ఇప్పటి వరకు బయట కలవని వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. కచ్చితంగా ఇది ఒక నీచుడి పనే అని నాకు తెలుసు. అతనికి నేను ఇచ్చే ఫైనల్ వార్నింగ్ ఇదే, ఇంకోసారి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే లీగల్ గా వెళ్తాను. నేను ఇప్పటి వరకు ఎలాంటి పెళ్లి చేసుకోలేదు. నేను పెళ్లి చేసుకునేటప్పుడు, ప్రపంచం మొత్తానికి తెలిసేలాగానే చేసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది మెహ్రీన్.