Mehreen Pirzada: ‘బబ్లీ బ్యూటీ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా’కి ఇప్పుడు ఛాన్స్ లు కావాలట. కాలం కలిసి రాక, హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవుడు భవ్య బిష్ణోయ్ తో విడిపోయింది. లేకపోతే ముఖ్యమంత్రి మనవడికి సతీమణి అయ్యేది. ఎలాగూ ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది కాబట్టి, ఇప్పుడు సినిమాల ఛాన్స్ లను మాత్రం మిస్ చేసుకోదల్చుకోలేదట.

అందుకే, నిశ్చితార్థం రద్దు చేసుకున్న మరుసటి రోజు నుంచే మళ్ళీ తన అభిమానుల కోసం అందాల విందుకి రెడీ అయింది. పైగా అప్పటి నుంచే మళ్ళీ గ్లామర్ షో షురూ చేస్తూ హాట్ హాట్ ఫోటో షూట్స్ చేసింది. తన పాత పద్ధతిలోనే సెక్సీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తాను మళ్లీ ఫామ్ లోకి వచ్చాను అన్నట్టు దర్శకులకు ఈ హాట్ బ్యూటీ సిగ్నల్స్ పంపంది.
దాంతో మెహ్రీన్ కి అవకాశాలు బాగానే వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ముఖ్యంగా కన్నడ చిత్ర సీమలో ఈ భామ బాగా బిజీ అయ్యేలా కనిపిస్తుంది. అందుకే, ఇక ఇప్పట్లో మెహ్రీన్ పెళ్లి అనే ఆలోచన చెయ్యను అంటుంది. తన ఫోకస్ మొత్తం ఇప్పుడు సినిమాల మీదే పెట్టిందట. ప్రస్తుతం వరుణ్ తేజ్ సరసన “ఎఫ్ 3″లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ బ్యూటీ చేతిలో మరో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. నిజానికి తెలుగులో కంటే కూడా మెహ్రీన్ కి ఇప్పుడు కన్నడ తమిళ సినిమాల్లోనే బాగా డిమాండ్ ఉంది. తమిళంలో విశాల్ సినిమాలో నటిస్తోంది. అలాగే మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఏది ఏమైనా పెళ్లి పెటాకులు అయ్యాక, కెరీర్ సెట్ చేసుకోవడానికి కిందామీదా మెహ్రీన్ పడాల్సి వస్తోంది.