Pawan Kalyan: మెహర్ రమేష్… ఈ పేరు వింటేనే హీరోల అభిమానులు భయపడే పరిస్థితి. ఒక్క ప్రభాస్ కి మినహాయిస్తే అందరికీ ఆయన డిజాస్టర్స్ ఇచ్చారు. మెహర్ రమేష్ కెరీర్లో బిల్లా ఓ మోస్తరు హిట్ మూవీగా ఉంది. ఇక ఎన్టీఆర్ చేసిన కంత్రి, శక్తి ఫలితాలు తెలిసిందే. శక్తితో అయితే నిర్మాత అశ్వినీ దత్ నిండా ముగినిపోయాడు.వెంకటేష్ కి షాడో రూపంలో పెద్ద షాక్ ఇచ్చాడు. షాడో రిజల్ట్ చూసి మెహర్ రమేష్ ని పరిశ్రమ పక్కన పెట్టేసింది.
ఏకంగా 10 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్ ఇచ్చాడు. అజిత్ హిట్ మూవీ వేదాళం చిత్రాన్ని భోళా శంకర్ గా తెరకెక్కించాడు. కనీసం భోళా శంకర్ తో ఫేట్ మారుతుంది అనుకుంటే… రిజల్ట్ రిపీట్ అయ్యింది. భోళా శంకర్ మూవీ చిరంజీవికి ప్లాప్ అంటగట్టింది. ఇకపై మెహర్ రమేష్ కి ఆఫర్స్ రావడం కష్టం అనుకుంటున్న తరుణంలో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మూవీ చేస్తానంటూ విశ్వాసం ప్రకటించాడు.
పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేశానన్న మెహర్ రమేష్ ఆయనతో మూవీ చేస్తాను అంటున్నారు. భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ తో మూవీ ఉంటుందని అన్నారు. మెహర్ రమేష్ ట్రాక్ చూస్తే టైర్ టు హీరో కూడా ఛాన్స్ ఇవ్వడం కష్టం. అలాంటిది పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తారా? అనేది చూడాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చినా మూవీ సాధ్యమేనా అనే సందేహాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చేస్తున్న ప్రాజెక్ట్స్ నత్తనడక సాగుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తుండగా… ఆయన మరింత బిజీ అయ్యారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఓజీ, హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూటింగ్ కి తాత్కాలిక బ్రేక్ పడింది. రానున్న ఆరు నెలలు చాలా కీలకం కాగా… పవన్ కళ్యాణ్ షూటింగ్స్ లో పాల్గొనే అవకాశం లేదు. కాబట్టి మెహర్ రమేష్ కి ఆయన ఛాన్స్ ఇవ్వడం, అది పట్టాలెక్కడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు..
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More