Movies : సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అంటే అంత ఆషామాషి వ్యవహారమైతే కాదు. ఒక సినిమా సక్సెస్ అయింది అంటే దాని వెనకాల ఎంతోమంది కృషి ఉంటుంది. అందుకే ఇక్కడ అలుపెరగకుండా కష్టపడుతూ ముందుకు సాగిన వాళ్లకు మాత్రమే మంచి క్రేజ్ ఉంటుంది… ఇక్కడ రాణించాలి అంటే మంచి కథలను ఎంచుకోవాలి తద్వారా మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తూ ఉండాలి. అలా అయితేనే జనాల్లో క్రేజ్ పెరిగి ఆయా హీరోలకు అభిమానుల సంఖ్య కూడా పెరుగుతుందనే చెప్పాలి…
సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పుడున్న జనరేషన్ లో ఒక్కో హీరో ఒక సంవత్సరంలో ఒక సినిమా చేయడమే చాలా కష్టంగా మారిన సందర్భంలో ఒక స్టార్ హీరో మాత్రం ఏకంగా ఒక సంవత్సరంలోనే 33 సినిమాలను రిలీజ్ చేశాడు. దాంతోపాటుగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇలాంటి రికార్డు సాధించిన వాళ్ళలో ఆయన కూడా ఒకరు కావడం విశేషము. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే మలయాళం సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న మమ్ముట్టి (Mamootty) కావడం విశేషం… ఇక ఆ ఇండస్ట్రీలో ఇతన్ని మెగాస్టార్ గా అభివర్ణిస్తూ ఉంటారు. ఇక ఇప్పటివరకు ఆయన 420 కి పైన సినిమాల్లో నటించినప్పటికి ఒకే సంవత్సరంలో 33 సినిమాలను రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి ఇలాంటి ఘనతను సాధించిన ఈ హీరో ఎప్పుడు ప్రయోగాత్మకమైన సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. మరి ఏది ఏమైనా కూడా ఆయన చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ కనక లేకపోతే ఆయన సినిమాలు చేయడు…
ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాలనే ఒక ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. మమ్ముట్టి ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తు అయితే ఇకమీదట చేయబోయే సినిమాలతో మంచి విజయాలను అందుకుంటాడని చెబుతూ ఉండటం విశేషం…
ఇక గత సంవత్సరంలో వచ్చిన ‘బ్రమయుగం ‘ (Bramayugam) సినిమా అయితే విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా నటుడిగా ఆయనకంటూ ఒక ఉన్నత స్థానాన్ని కల్పించిందనే చెప్పాలి. 70 సంవత్సరాలకు దగ్గరలో ఉన్న మమ్ముట్టి ఏజ్ లో కూడా ఎక్కడ తడబడకుండా మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా కేవలం ప్రయోగాత్మకమైన సినిమాలను మాత్రమే చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు…ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న గుర్తింపు అంతా ఇంతా కాదు… మన సీనియర్ హీరోలు కమర్షియల్ సినిమాలను నమ్ముకుంటూ ముందుకెళ్తుంటే మమ్ముట్టి మాత్రం ఇప్పటికి ప్రయోగాత్మకమైన సినిమాలనే చేస్తున్నాడు…అందుకే ఆయన మలయాళం ఇండస్ట్రీ కి మెగాస్టార్ అయ్యాడు…