Ram Gopal Varma: మెగాస్టార్ చిరంజీవిపై డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. CM జగన్‌తో సినీ ప్రముఖుల భేటీని ఉద్దేశిస్తూ RGV ట్వీట్ చేశారు. ‘చిరంజీవి గారు.. మీలాగా మీ సోదరుడు పవన్ ఎప్పటికీ ఒకర్ని అడుక్కోరు. మీకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ ఆదరణ పొందడానికి కారణం అదే. మెగా అభిమానులు కూడా మిమ్మల్ని ఇష్టపడరు’ అని ఆర్జీవీ అన్నారు. ఆయన ఈ కామెంట్స్ వ్యంగ్యంగా అన్నారా ? లేక నిజంగానే పవన్‌ను పొగిడారా.? అనేది ఆర్జీవీకే తెలియాలి.

మొత్తానికి ఆర్జీవీ మళ్లీ కొత్తగా వివాదాన్ని రెచ్చగొట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. వర్మ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం ట్విట్టర్ లో చర్చనీయాశంగా మారింది. అసలు వర్మ ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్స్ చేస్తాడో తెలియదు గానీ, అభిమానుల్లో మాత్రం గందరగోళాన్ని సృష్టిస్తూ తాను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అసలు ఈ ఆర్జీవీకి ఏమి కావాలి ? ఎందుకు అనవసరంగా అందర్నీ కెలుక్కుంటూ ఉంటాడు. అయినా మెగాస్టార్ గురించి నెగిటివ్ గా కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది ?
Also Read: రజనీకాంత్ తో సినిమా.. లాభాలు వస్తాయా ? లేక నష్టాల మయమేనా ?
మరీ వర్మ పైత్యం ఎప్పటికి తగ్గుతుందో ! గత కొన్ని రోజుల క్రితం ఆర్జీవీ అల్లు అర్జున్ ను బాగా ప్రమోట్ చేశాడు. అవసరం ఉన్నా లేకపోయినా.. బన్నీ ప్రస్తావన తెచ్చి మరీ.. బన్నీ పాన్ ఇండియా స్టార్ అంటూ ఏవేవో మాటలు చెప్పి.. మొత్తానికి బన్నీని బాగా హైలైట్ చేశాడు. టాలీవుడ్ లో గొప్ప టాలెంట్ ఉన్న ఏకైక వ్యక్తి అంటూ బన్నీ గురించి వర్మ ఇప్పటికే చాలాసార్లు స్పీచ్ లు ఇచ్చాడు.

అయినా, ఎవరి గురించి ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడతాడో, ఎవరి గురించి ఎప్పుడు బ్యాడ్ గా ప్రమోట్ చేస్తాడో వర్మకే తెలియదు. అందుకే, వర్మ గొంతు చించుకుని మరి బన్నీ గురించి పొగుడుతున్నా.. బన్నీ ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను పొగడుతూ .. మెగాస్టార్ ను తిడుతూ పోస్ట్ లు పెడుతున్నాడు వర్మ.
Also Read: డిగ్రీ అర్హతతో విజయవాడలో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?
[…] Also Read: మెగాస్టార్.. మెగా అభిమానులు కూడా మిమ్… […]