
దర్శకుడు సురేందర్ రెడ్డి టాలెంటెడ్ అండ్ షార్ప్ డైరెక్టరే. ఈ విషయంలో సురేందర్ రెడ్డిని తక్కువ చేయలేం. అలా అని వందల కోట్ల రూపాయిల సినిమాని డైరెక్ట్ చేసే డైరెక్టరా అంటే.. ఏమో నిర్మాతకి ఆర్ధికంగా కష్టమే అని అనుకోవాలి. లేకపోతే.. ‘సైరా’ లాంటి భారీ సినిమా చేసే అవకాశం వస్తే.. ఆయన చేసింది ఏమిటి ? సైరా సినిమాకి నష్టాలు వచ్చాయి. పైగా ఆ సినిమాలో ఇండియన్ సినీ ఇండస్ట్రీల నుండి సూపర్ స్టార్స్ అందరూ కలిసి నటించారు. మరి అంత పెద్ద స్టార్స్… పైగా అందరూ గొప్ప టీం మెంబర్స్.. అంత చేసినా దర్శకుడిగా సురేందర్ రెడ్డి ఆ సినిమాని హిట్ చేయలేకపోయాడనేది వాస్తవమేగా.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
కాకపోతే, ఆ వాస్తవంలోకి ఆయన రావడానికి కాస్త ఇబ్బంది పడుతోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి – అక్కినేని అఖిల్ సినిమా లైన్ లో ఉంది. వక్కంతం వంశీ ఈ సినిమాకి కథ అందించాడు. వంశీ కథ అఖిల్ కి కరెక్ట్ గా సరిపోతుందని.. అందుకే నాగార్జున కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇష్టం లేకపోయినా సురేందర్ రెడ్డి కూడా అఖిల్ తో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. కాకపోతే బడ్జెట్ విషయంలో మాత్రం సురేందర్ రెడ్డి ఎక్కడా తగ్గడం లేదు. తానూ చేస్తోన్న ఈ సినిమాకి ఎనబై కోట్ల బడ్జెట్ అవుతుందని..తానూ అడిగిన బడ్జెట్ ఇవ్వకపోతే సినిమాని చేయనని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చి సినిమాకి కాస్త గ్యాప్ కూడా ఇచ్చాడు.
Also Read: కరోనాకు ‘నో’.. తికమకపెడుతున్న సెలబ్రెటీలు..!
అయితే ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో అంత బడ్జెట్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందా అని నిర్మాతలు భయపడుతున్నారట. దాంతో నాగార్జున సురేందర్ రెడ్డిని పిలిచి, బడ్జెట్ విషయంలో మరోసారి ఆలోచించుకోవాలని.. అలాగే ఎక్కడా ఓవర్ బడ్జెట్ అవ్వకూడదు అని చెప్పాడట. అయినప్పటికీ సురేందర్ రెడ్డి మాత్రం బడ్జెట్ తగ్గితే సినిమా చేయలేనని బెట్టు చేస్తున్నాడట. ఎంత లేదు అన్నా.. సైరా సినిమా ఫలితం ఏమిటన్నది పక్కన పెడితే.. ఒక డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి బాగా డైరెక్ట్ చేశాడు. సినిమా భారీ సక్సెస్ కాకపోవడానికి సురేందర్ రెడ్డి కారణం కాదు కదా.. అందుకే ఒక డైరెక్టర్ గా తాను ఎందుకు తగ్గాలి అని ఆయన లెక్క కావొచ్చు.