
యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ మూవీలో ప్రభాస్ కు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కరోనాతో వాయిదా పడగా ఇటీవల తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. కరోనా తర్వాత ఇటలీలో షూటింగ్ జరుపుకున్న తొలి విదేశీ చిత్రంగా ‘రాధేశ్యామ్’ రికార్డు సృష్టించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
ఈ మూవీ తర్వాత ప్రభాస్ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించబోతున్నాడు. ఒకటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సైంటిఫిక్ మూవీలో.. రెండోదో బాలీవుడ్ దర్శకుడు తెరకెక్కించనున్న ‘ఆదిపురుష్’. ఈ రెండు కూడా ప్రభాస్ ‘బాహుబలి’ రేంజ్లో నిర్మించనున్నడటంతో వీటిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: కరోనాకు ‘నో’.. తికమకపెడుతున్న సెలబ్రెటీలు..!
‘రాధేశ్యామ్’ డిసెంబర్ వరకు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. అయితే ముందుగా బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కించున్న ‘ఆదిపురుష్’ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఓం రావత్ ఈ మూవీని జనవరి నుంచే ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నాడు. ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా గ్రాఫిక్స్ మాయజాలం నిలువనుంది.
‘ఆదిపురుష్’ కోసం ప్రభాస్ ఏకదాటిగా ఆరునెలలపాటు షూటింగులో పాల్గొననున్నాడట. ఇప్పటికే మిగతా నటీనటుల డేట్స్ ను ఓం రావత్ తీసుకున్నాడు. జనవరి రెండో వారంలో లేదా మూడో వారంలో ప్రభాస్ ఈ సినిమా షూటింగులో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ముందుగా గ్రాఫిక్స్ వర్క్ పూర్తిచేసి ఈ ఏడాది చివర్లో తదుపరి సీన్స్ ను షూట్ చేస్తారనే తెలుస్తోంది.
Also Read: బిగ్ బాస్-4: ‘ఇమ్యూనిటినీ’ కోల్పోయిన కంటెస్టెంట్లు..!
ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ చేస్తూనే మరోవైపు నాగ్ అశ్విన్ మూవీ కూడా పట్టాలెక్కించనున్నాడు. ఈ ఏడాది వేసవిలో నాగ్ అశ్విన్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆదిపురుష్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని నాగ్ అశ్విన్ మూవీలో ప్రభాస్ నటించనున్నాడు. దీంతో 2021 ప్రభాస్ ఫుల్ బీజీగా మారనున్నాడు.