https://oktelugu.com/

Pawan Kalyan Hari Hara Veera Mallu : బిగ్ అప్ డేట్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇక జాతరే.. కాస్కోండి!

Pawan Kalyan Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఒక క్రేజీ అప్ డేట్ వచ్చింది. పవన్ రెండు సినిమాలకు వరుసగా డేట్లు ఇచ్చారు. సముద్రఖని దర్శకుడిగా రూపొందనున్న ‘వినోదయా సితం’ రీమేక్ కోసం పవన్ కల్యాణ్ 20 రోజుల పాటు డేట్స్ ఇచ్చారు. ఇది చిన్న సినిమా కావడం.. పవన్ కల్యాణ్ పాత్ర నిడివి తక్కువగానే ఉండటం వలన 20 రోజుల్లోనే తన పోర్షన్ ను పవన్ పూర్తి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : September 14, 2022 / 01:35 PM IST
    Follow us on

    Pawan Kalyan Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఒక క్రేజీ అప్ డేట్ వచ్చింది. పవన్ రెండు సినిమాలకు వరుసగా డేట్లు ఇచ్చారు. సముద్రఖని దర్శకుడిగా రూపొందనున్న ‘వినోదయా సితం’ రీమేక్ కోసం పవన్ కల్యాణ్ 20 రోజుల పాటు డేట్స్ ఇచ్చారు. ఇది చిన్న సినిమా కావడం.. పవన్ కల్యాణ్ పాత్ర నిడివి తక్కువగానే ఉండటం వలన 20 రోజుల్లోనే తన పోర్షన్ ను పవన్ పూర్తి చేయనున్నాడు.

    Pawan Kalyan Hari Hara Veera Mallu

    Also Read: Bandla Ganesh Pawan Kalyan: బండ్లన్నా.. పవన్ కల్యాణ్ ను వదిలేయ్ ప్లీజ్..

    అలాగే క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకి పవన్ 15 రోజుల పాటు డేట్లు ఇచ్చాడు. ఈ నెల 18 వ తేదీ నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ కొత్త షెడ్యూల్ లో నోరా ఫతేహీ – పవన్ ల పై ఓ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు. ఇక ఈ క్రేజీ చిత్రం హరిహర వీరమల్లు వచ్చే సంక్రాంతికి టార్గెట్‌ చేసినట్టు చిత్ర వర్గాలు అంటున్నాయి. వచ్చే రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేయాలని క్రిష్ భావిస్తున్నారు. ఇప్పటికే 60 శాతం షూట్ పూర్తి కాగా, జనవరి 12న పొంగలి సందర్భంగా విజయదుందుభి మోగించాలనుకుంటున్నారు. మొఘల్ కాలం నాటి కథతో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు సినిమా. కాబట్టి, సినిమా నేపథ్యానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. అందుకే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

    Pawan Kalyan Hari Hara Veera Mallu

    Also Read: Farmer Love Is Infinite: పొలంలో తల్లిదండ్రుల రూపం.. ఆ రైతు ప్రేమ అనంతం

    పైగా పవన్ కి ఈ సినిమాలో 3 షేడ్స్ కు సంబంధించి 3 డిఫరెంట్ గెటప్స్ ప్లాన్ చేశాడు క్రిష్. ఒకటి వజ్రాల దొంగ వీరమల్లు గెటప్ అయితే, సిక్కు సైనికుల్ని కాపాడే రక్షకుడిగా మరో గెటప్, అలాగే దేశం కోసం పోరాడే వీరుడిగా మరో గెటప్ లో పవన్ కనిపించబోతున్నాడు. అన్నిటికీ మించి 17వ శతాబ్దం నాటి కథ కావడంతో.. పవన్ దుస్తులు, యాక్ససరీస్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇలా పవన్ పాత్రలో 3 డిఫరెంట్ షేడ్స్, గెటప్స్ ఉండటంతో చాలా స్లోగా సాగుతుంది షూటింగ్. ఏది ఏమైనా వచ్చే సంక్రాంతికి మాత్రం ఈ సినిమాని రిలీజ్ చేయాలని నిర్మాత రత్నం పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు పోతున్నాడు. మరి వచ్చే సంక్రాంతికి పవన్ ఫ్యాన్స్ కి ఇక జాతరే కాస్కోండి.