Homeఎంటర్టైన్మెంట్ఒకే ఫ్రేమ్ లో టాప్ డైరెక్టర్స్ తో మెగాస్టార్ !

ఒకే ఫ్రేమ్ లో టాప్ డైరెక్టర్స్ తో మెగాస్టార్ !

తెలుగు సినిమా పరిశ్రమలో ముందు నుంచి దర్శకుల మధ్య మంచి అవగాహన ఉంది. ఒకరితో ఒకరు మంచి స్నేహంగా ఉండటం ఆనవాయితీగా వస్తోంది. నేటి జనరేషన్ డైరెక్టర్స్ కూడా ఆ ఆనవాయితీని అలా కంటిన్యూ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రెజెంట్ టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్స్‌ అంతా ఒకచోట చేరి సంతోషంగా గడిపారు. మరి టాప్ డైరెక్టర్స్ అంతా ఒక చోట చేరితే ఆ ఎంజాయ్ మెంట్ వేరు. ఆ సందడే వేరు. పైగా ప్రముఖ దర్శకులంతా కలిసినప్పుడు […]

Chiranjeeviతెలుగు సినిమా పరిశ్రమలో ముందు నుంచి దర్శకుల మధ్య మంచి అవగాహన ఉంది. ఒకరితో ఒకరు మంచి స్నేహంగా ఉండటం ఆనవాయితీగా వస్తోంది. నేటి జనరేషన్ డైరెక్టర్స్ కూడా ఆ ఆనవాయితీని అలా కంటిన్యూ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రెజెంట్ టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్స్‌ అంతా ఒకచోట చేరి సంతోషంగా గడిపారు. మరి టాప్ డైరెక్టర్స్ అంతా ఒక చోట చేరితే ఆ ఎంజాయ్ మెంట్ వేరు.

ఆ సందడే వేరు. పైగా ప్రముఖ దర్శకులంతా కలిసినప్పుడు చాల ముచ్చట్లు వస్తాయి. అందులో భాగంగానే ఒక కొత్త కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది. కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వడం కోసం దర్శకులంతా ఓ ఓటీటీ ప్లాట్ ఫామ్ పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఇంతకీ ఈ దర్శకులంతా ఎక్కడ కలుసుకున్నారు ? దేనికి కలుసుకున్నారు అంటే.. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి పుట్టిన రోజు వేడుకల్లో కలుసుకున్నారు.

జూలై 25న వంశీ పుట్టినరోజు జరుపుకున్నాడు. అయితే, ఆ రోజు రాత్రి జరిగిన బర్త్ డే పార్టీలో ఇలా చాలమంది టాప్ దర్శకులు కనిపించి సందడి చేశారు. ఈ క్రమంలో వీరి దిగిన ఫోటోలు, బర్త్‌ డే వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్‌ అవుతూ తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఏది ఏమైనా ఒకే ఫ్రేమ్‌ లో టాలీవుడ్‌ టాప్ దర్శకులంతా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

పైగా ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ప్రత్యేక అతిధిగా వచ్చారు. ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న డైరెక్టర్స్ లిస్ట్ లో కొరటాల శివ, పరశురామ్‌, సుకుమార్‌, బోయపాటి శ్రీను, మెహర్‌ రమేశ్‌ ఉన్నారు. అలాగే హీరోయిన్ కీర్తి సురేశ్‌, నిర్మాత దిల్‌ రాజు అలాగే ఆయన భార్య, మరో నిర్మాత అల్లు అరవింద్‌, నటుడు సోనూసూద్‌ కూడా ఈ బర్త్‌డే వేడుకకు హాజరయ్యారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper