Megastar Chiranjeevi Surgery: ఏడాది కాలంగా చిరంజీవి క్షణం తీరిక లేకుండా పని చేస్తున్నారు. ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ చిత్రాలు చకచకా పూర్తి చేసి విడుదల చేశారు. త్వరలో మరో కొత్త ప్రాజెక్ట్ మొదలుకానుంది. వరుస షూట్స్ లో పాల్గొంటున్న చిరంజీవి మోకాలికి గాయమైనట్లు సమాచారం అందుతుంది. కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు సర్జరీ సూచించారట. ఈ క్రమంలో ఆయన చికిత్సకు సిద్ధమవుతున్నారని టాలీవుడ్ టాక్. మోకాలి సర్జరీ కోసం చిరంజీవి అమెరికా వెళ్లనున్నారట. లేదంటే హైదరాబాద్ లో కూడా జరగొచ్చట.
తన కొత్త ప్రాజెక్ట్ మొదలు కావడానికి ముందే చిరంజీవి సర్జరీ చేయించుకున్నారట. కొద్ది నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్న చిరంజీవి కోలుకున్నాక నయా ప్రాజెక్ట్ బిగిన్ చేస్తారట. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. చిరంజీవి కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. మరి ఈ వార్తలపై చిరంజీవి స్పందిస్తారేమో చూడాలి.
వాల్తేరు వీరయ్య మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవికి భోళా శంకర్ షాక్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడనంత డిజాస్టర్ గా భోళా శంకర్ నిలిచింది. రెండో రోజుకే భోళా శంకర్ వసూళ్లు పడిపోయాయి. దర్శకుడు మెహర్ రమేష్ అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే తో నిరాశపరిచాడు. భోళా శంకర్ రీమేక్ కాగా చిరంజీవి ఇకపై రీమేక్స్ చేయకుండా ఉంటే మంచిదన్న అభిప్రాయం అభిమానులు వెల్లడిస్తున్నారు.
కాగా నెక్స్ట్ చిరంజీవి సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మూవీ చేయనున్నారట. ఈ మూవీలో మరో హీరో శర్వానంద్ నటిస్తున్నారని సమాచారం. ఇది మలయాళ హిట్ బ్రో డాడీ రీమేక్ అనే మాట వినిపిస్తోంది. ఈ మూవీ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మించనున్నారు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బింబిసార దర్శకుడు వశిష్ట్ తో ఒక మూవీ చేయనున్నారని సమాచారం.