Megastar Chiranjeevi Special: ‘స్వయంకృషి’తో ఎదిగిన స్టార్ హీరో మెగాస్టార్ . అందుకే, మెగాస్టార్ అంటే.. స్టార్ హీరోలకు కూడా ప్రత్యేక ఆకర్షణ, అభిమానం ఉంటుంది. పైగా టాలీవుడ్ బాక్సాఫీస్ కు కొత్త లెక్కలు అద్దిన ఘనత కూడా చిరుకే దక్కుతుంది. పైగా తన స్టెప్స్ తో ఎంతో మంది హీరోలకు పాఠాలు నేర్పిన ‘ఆచార్యు’డు చిరు. ఇక యాక్షన్ కు సరికొత్త అర్ధాన్ని వివరించిన ‘గాడ్‌ఫాదర్’ చిరు. అలాగే, ఇండస్ట్రీ హిట్లకు కొత్త దారులను చూపించిన ‘హిట్లర్’ చిరు. ప్రతి పాత్రని ‘ఛాలెంజ్’గా తీసుకొని ‘విజేత’గా నిలిచిన ‘హీరో’ మన మెగాస్టార్. అన్నిటికీ మించి రక్తదానం, నేత్రదానంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ‘ఆపద్బాంధవుడు’ మన చిరు. అలాగే కరోనా సమయంలో పేద కళాకారుల కడుపు నింపిన ‘మగ మహారాజు’.. మన ‘అందరివాడు’. అందుకే, చిరంజీవి అంటే జనాలకు పిచ్చి. నేడు చిరు పుట్టిన రోజు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఎవరికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో చిన్న చిన్న పాత్రలు వేశారు. అప్పుడు ఆయనకు ఎంతో సాయం చేసిన ఓ వ్యక్తి ఉన్నాడు. ఆయన దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఈయన అఫీస్ లోనే చిరు చాలా రోజులు ఉన్నారు. మెగాస్టార్ కి తన బర్త్‌డే ఆగస్ట్ 22న ఎంత ప్రత్యేకమో.. సెప్టెంబర్ 22 ను అంతకంటే స్పెషల్ గా భావిస్తారు. కారణం.. చిరు నటించిన తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’ ఇదే రోజు విడుదలైంది. కొణిదెల శివశంకర్ వరప్రసాద్‌ని చిరంజీవిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రోజు సెప్టెంబర్ 22నే.
Also Read: Nagababu warning: చిరంజీవిని అవమానిస్తే ఊరుకునేది లేదు.. నాగబాబు హెచ్చరిక
తాను నటించిన అన్నీ చిత్రాల్లో ఎక్కువగా ఏ చిత్రం ఇష్టమో చిరు ఓ సందర్భంలో చెప్పారు. ఆ సినిమా పేరే ‘రుద్రవీణ’. కారణం ఈ సినిమాలో పాటలు అంటే చిరంజీవికి చాలా బాగా ఇష్టమట. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘నమ్మకు నమ్మకు ఈరేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని’అనే పాట చిరుకి బాగా ఇష్టం అట. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటో తెలుసా ?, చిరంజీవి చేతి రాత బాగుండదట. అందుకే.. చిరు రాసిన దాన్ని ఆయనే మళ్లీ చదవలేకపోయేవారట. అందుకే.. ఆయన తన సైన్ ను చాలా రోజులు ప్రాక్టీస్ చేశారట. మెగాస్టార్ కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అట. అందుకే, వీలు చిక్కినప్పుడల్లా ఆయన ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధిస్తూ ఉంటారు. మెగాస్టార్ ఓ షర్ట్‌ని రెండేళ్ల పాటు ఉతకకుండా వేసుకున్నాడని మీకు తెలుసా ?. ‘అంజి’ సినిమా కోసం ఓ షర్ట్‌ని రెండేళ్ల పాటు ఉతకకుండా చిరు వేసుకున్నారు. ఇక రెండు బిరుదులు పొందిన అరుదైన హీరోలలో చిరంజీవి కూడా ఒకరు. కెరీర్ తొలినాళ్లలో ‘సుప్రీమ్ హీరో’గా ఆ తర్వాత ‘మెగాస్టార్’గా ఆయన క్రేజ్ సంపాదించుకున్నారు.