Chiranjeevi- Koratala Siva: ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఆచార్య సినిమా విడుదలై ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ఆ అంచనాలను అందుకోవడం లో విఫలమైంది..చివరిగా ఫలితం చూస్తే చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..ఇంత చెత్త సినిమా చిరంజీవి తన 150 సినిమాల్లో ఎప్పుడు కూడా చెయ్యలేదని మెగా ఫాన్స్ పెదవి విరిచారు..దానికి తోడు ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ముఖ్య పాత్ర పోషించిన సంగతి మన అందరికి తెలిసిందే..తండ్రి కొడుకులు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అంటే కచ్చితంగా అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు..సినిమా అదిరిపోవాలి కోరుకుంటారు..కానీ ఆచార్య సినిమా వారి అంచనాలకు దరిదాపుల్లోకి కూడా రాకపోవడం తో చాలా నిరాశకి గురైయ్యారు..అయితే ఇటీవలే అభిమానుల్లో నెలకొన్ని ఆ నిరాశని రూపుమాపి మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో వాళ్లలో మంచి ఉత్సాహాన్ని నింపాడు.

ఈ సినిమా మొదటి రోజు నుండి ఇప్పటి వరుకు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మాత్రం జోరు తగ్గకుండా దూసుకుపోతూనే ఉంది..నిన్న ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు..ఈ సక్సెస్ మీట్ కి మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా మూవీ టీం మొత్తం హాజరయ్యింది..ఈ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ మోహన్ రాజా గారు మాట్లాడుతూ ‘చిరంజీవి గారు డైరెక్షన్ లో చొరవ తీసుకుంటారని ఎవరైనా అంటే వాళ్ళని కచ్చితంగా కొట్టేస్తాను..ఆయన అనుభవం మాకు కావాలి..సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరుకు ఆయన అనుభవం తో ఇచ్చిన ఇన్ పుట్స్ వల్లే ఈ సినిమా ఔట్పుట్ ఇంత అద్భుతంగా వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చారు..ఇక ఆ తర్వాత చిరంజీవి ఆఖరిలో 30 నిమిషాలకు పైగా ప్రసంగం ఇచ్చారు.

ఈ ప్రసంగం లో ఆయన కొరటాల శివ కి పరోక్షంగా చురకలు అంటించారు..ఆయన మాట్లాడుతూ ‘సినిమా అంటే అందరి అభిప్రాయాలను తీసుకొని..సమిష్టి కృషి తో మాలాంటి అనుభవజ్ఞులు ఇచ్చే సూచనలు తీసుకొని పని చేస్తేనే బాక్స్ ఆఫీస్ ఫలితం మంచిగా ఉంటుంది..అంతే కానీ మీ పని మీరు చూసుకోండి..నేను చెప్పింది చెయ్యండి అన్నట్టు ఉంటె ఫలితం తారుమారు అవుతుంది’ అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..ఇది ఆయన పరోక్షంగా డైరెక్టర్ కొరటాల శివ కి చురకలు రాణిస్తున్నారు అనే విషయం అందరికి అర్థం అయిపోతుంది..చిరంజీవి గారి నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ లో హిట్స్ తో పాటుగా ఎన్నో ఫ్లాప్స్ కూడా ఉన్నాయి..కానీ ఏనాడు కూడా ఆయన ఇంత పర్సనల్ గా తీసుకోలేదు..కానీ ఆచార్య సినిమా విషయం లో మాత్రం చాలా గుర్రుగా ఉన్నాడని మాత్రం అర్థం అయిపోతుంది అని అంటున్నారు విశ్లేషకులు.