అయితే సెప్టెంబర్ 5 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో అత్యంత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ‘ఓజీ'(They Call Him OG) చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే నిర్మాతలను పిలిచి, బ్యాలన్స్ షూటింగ్ కి సంబంధించిన డేట్స్ గురించి చర్చించాడట. జూన్ నెలలో ఆయన ఓజీ చిత్రాన్ని పూర్తి చేస్తాడని తెలుస్తుంది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు డేట్స్ కేటాయిస్తాడో ఒక క్లారిటీ ఇస్తే, వెంటనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తుంటారట మేకర్స్. ఒకే నెలలో అన్నదమ్ముల సినిమాలు 20 రోజుల గ్యాప్ లో విడుదల అవ్వడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. ఇదే మొదటిసారి, గతం లో పవన్ కళ్యాణ్ నటించిన ‘గుడుంబా శంకర్’ చిత్రం, అదే విధంగా చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా MBBS’ చిత్రం ఆరు వారాల గ్యాప్ తో విడుదలయ్యాయి.
గుడుంబా శంకర్ యావరేజ్ రేంజ్ లో ఆడగా, శంకర్ దాదా MBBS చిత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. అయితే ఓజీ చిత్రానికి సెప్టెంబర్ నెల మొత్తం కలిసి వస్తుంది, ముఖ్యంగా దసరా సెలవులు సోలో గా ఎంజాయ్ చేయొచ్చని అభిమానులు ఒక అంచనా వేసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి ఆ దసరా సీజన్ ని పట్టుకోవడం తో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీ లోనే అత్యంత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రమిది. అలాంటి సినిమాకు ఫ్రీ గ్రౌండ్ దొరికితే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ అవుతాయి. చిరంజీవి ఆ ఛాన్స్ ని మిస్ చేస్తున్నాడంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఈ రెండు సినిమాలు ఒకే నెలలో విడుదలైతే విశ్వంభర చిత్రానికే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంది, మరి ఏమి జరగబోతుందో చూడాలి.