Chiranjeevi: కులాల మధ్య అగ్గి రాజేసిన మెగాస్టార్ చిరంజీవి సరికొత్త యాడ్..? అసలు ఏమైందంటే!

రీసెంట్ గా ఆయన 'కంట్రీ డిలైట్' మిల్క్ యాడ్ లో నటించాడు. ఈ యాడ్ లో ఆయన ద్విపాత్రాభినయం చేసాడు, వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ ని ఈ యాడ్ లో మనం చూడొచ్చు. ఇందులో కమెడియన్ సత్య కూడా నటించగా, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ కమర్షియల్ యాడ్ కి దర్శకత్వం వహించాడు.

Written By: S Reddy, Updated On : September 10, 2024 5:10 pm

Chiranjeevi(5)

Follow us on

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడైతే యాడ్స్ తగ్గించాడు కానీ, ఒకప్పుడు మాత్రం ఆయన యాడ్ వరల్డ్ కి కింగ్ లాగా ఉండేవాడు. రాజకీయాల్లోకి వెళ్లేముందు సినిమాలతో పాటుగా, కమర్షియల్ యాడ్స్ ని కూడా పూర్తిగా వదిలేసి వెళ్ళాడు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు యాడ్ వరల్డ్ లో చిరంజీవి స్థానాన్ని రీ ప్లేస్ చేసాడు. అప్పటికీ కూడా యాడ్ వరల్డ్ లో మహేష్ బాబు కింగ్ గా కొనసాగుతున్నాడు. ఇదంతా పక్కన పెడితే రీ ఎంట్రీ తర్వాత మంచి జోష్ మీద సినిమాలు చేసుకుంటూ, రికార్డ్స్ మీద రికార్డ్స్ పెడుతూ మెగాస్టార్ చిరంజీవి ఈ వయస్సులో కూడా పోటీని ఇస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత ఆయన ఏకంగా మూడు సార్లు వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు ఆయన కమర్షియల్ యాడ్స్ లో కూడా కుర్ర హీరోలను డామినేట్ చేసేందుకు సిద్దమయ్యాడా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ పండితులు.

రీసెంట్ గా ఆయన ‘కంట్రీ డిలైట్’ మిల్క్ యాడ్ లో నటించాడు. ఈ యాడ్ లో ఆయన ద్విపాత్రాభినయం చేసాడు, వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ ని ఈ యాడ్ లో మనం చూడొచ్చు. ఇందులో కమెడియన్ సత్య కూడా నటించగా, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ కమర్షియల్ యాడ్ కి దర్శకత్వం వహించాడు. అయితే కంట్రీ డిలైట్ యాప్ ని ఎక్కువగా సిటీస్ లో వినియోగదారులు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఒక కులానికి చెందిన వారికి మొదటి నుండి చిరంజీవి అంటే ఇష్టం లేదనే విషయం మన అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆయన ‘థమ్స్ అప్’ యాడ్ ఇచ్చాడని, ఒక కుల వర్గానికి చెందిన వాళ్ళు ఆ పానీయం ని తాగడమే మానేశారు. అంతే కాదు ఆ పానీయం కి వ్యతిరేకంగా ప్రచారాలు కూడా చేసేవారు. కొన్ని కాలేజీలలో ఇలాంటి ప్రత్యేకమైన వాతావరణంని చూసారు అప్పటి జనాలు. అయితే ఇప్పుడు కూడా చిరంజీవి ఈ యాప్ ని ప్రమోట్ చేస్తుండడంతో ఆ వర్గానికి చెందిన కొంతమంది ఇక నుండి మేము కంట్రీ డిలైట్ పాలను తాగము అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇది నిజంగా మంచి పరిణామం కాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

కానీ తరతరాలుగా కుల అహంకారం తో మెలిగే కొంతమంది మూర్ఖులు ఎంత చెప్పినా వినరు కాబట్టి వాళ్ళని పట్టించుకోవడం మానేయండి అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ‘భోళా శంకర్’ చిత్రం తో భారీ డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్న చిరంజీవి, ఇప్పుడు విశ్వంభర చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల అయ్యేందుకు సిద్ధం గా ఉంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయనున్నారు.