Godfather vs Ghost: సాధారణంగా సంక్రాంతికి ఒకేరోజు రెండు పెద్ద చిత్రాల విడుదల కావడం చూస్తాం. అనూహ్యంగా దసరా నాడు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి-నాగార్జున తమ చిత్రాలు విడుదల చేశారు. గాడ్ ఫాదర్-ది ఘోస్ట్ అక్టోబర్ 5న బాక్సాఫీస్ యుద్ధానికి దిగాయి. మధ్యలో నేనూ ఉన్నానంటూ డెబ్యూ హీరో బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం మూవీతో వచ్చారు. అనూహ్యంగా ఈ మూడు చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. క్రిటిక్స్ గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యం చిత్రాల పట్ల అనుకూలంగా స్పందించారు.
గాడ్ ఫాదర్ మూవీతో వింటేజ్ చిరు గుర్తొచ్చారంటున్నారు. చాలా కాలం తర్వాత ఆయన ఇమేజ్ కి, స్టార్ డమ్ కి తగిన పాత్ర పడింది అంటున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గాడ్ ఫాదర్ లో పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ తో సిల్వర్ స్క్రీన్ పై దుమ్మురేపాడు అనేది మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం. అదే సమయంలో ది ఘోస్ట్ సూపర్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తార్ రేసీ స్క్రీన్ ప్లే, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో ఆకర్షణీయంగా మూవీ రూపొందించారని క్రిటిక్స్ అభిప్రాయం.
Also Read: Godfather Collections: ‘గాడ్ ఫాదర్’ మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం
నాగ్ స్టైలిష్ లుక్, సోనాల్ గ్లామర్ సినిమాకు మరో హైలెట్స్ . ఇక స్వాతిముత్యం చిత్రంతో నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు గణేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఆకట్టుకునే కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా క్రిటిక్స్ అభివర్ణించారు. ముఖ్యంగా రావు రమేష్ తన కామెడీ స్కిల్స్ తో ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేశారంటున్నారు. మూడు చిత్రాలకు పాజిటివ్ రివ్యూస్ నేపథ్యంలో దసరా విన్నర్ ఎవరనే సందిగ్ధత నెలకొంది.
అయితే రేసులో గాడ్ ఫాదర్ ముందున్నాడు. కలెక్షన్స్ పరంగా చిరంజీవిదే పై చేయి. వరల్డ్ వైడ్ ఈ మూవీ ఫస్ట్ డే రూ. 38 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ రిపోర్ట్ చేశారు. అదే సమయంలో ది ఘోస్ట్ కేవలం రూ. 4.6 కోట్ల షేర్ అందుకుంది. స్వాతిముత్యం కలెక్షన్ రిపోర్ట్స్ అందాల్సి ఉంది. ఇక వీకెండ్ ముగిస్తే కానీ… చిత్ర ఫలితాలను అంచనా వేయలేం. బ్రేక్ ఈవెన్ దాటిన సినిమానే హిట్ గా ప్రకటించగలం.
Also Read:T20 World Cup 2022- Team India: ఆల్ ది బెస్ట్ టీమిండియా.. ఈసారైనా కప్ తో రావాలే! సాధ్యమేనా?