Godfather Weekend Collections: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇటీవలే విడుదలై సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా సంగతి మన అందరికి తెలిసిందే..ఆచార్య సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో డీలాపడిన మెగా ఫాన్స్ లో ఈ సినిమా నింపిన జోష్ మామూలుది కాదు..తమిళ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాని తీర్చిదిద్దిన తీరు మెగా అభిమానులకు పూనకాలు రప్పించేలా చేసింది..ఈ చిత్రం మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా లూసిఫెర్ సినిమాకి రీమేక్ అనేది కేవలం నామమాత్రమే..కానీ ఈ సినిమాని చూస్తునంతసేపు రీమేక్ అని ఎవరికీ అనిపించకపోవడం వల్లే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం విశ్వరూపం చూపిస్తుంది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..ఇప్పటి వరుకు ఈ సినిమా 5 రోజుల లాంగ్ వీకెండ్ ని పూర్తి చేసుకుంది..ఏ 5 రోజులకు గాను ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ప్రాంతాల వారీగా ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ప్రాంతం షేర్ కలెక్షన్స్
నైజం 10.93 కోట్లు
సీడెడ్ 8.31 కోట్లు
ఉత్తరాంధ్ర 4.93 కోట్లు
ఈస్ట్ 3.25 కోట్లు
వెస్ట్ 1.88 కోట్లు
నెల్లూరు 1.76 కోట్లు
గుంటూరు 3.59 కోట్లు
కృష్ణ 2.31 కోట్లు
మొత్తం 36.96 కోట్లు
ఓవర్సీస్ 4.30 కోట్లు
కర్ణాటక 4.25 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.60 కోట్లు
వరల్డ్ వైడ్ 50.11 కోట్లు
లిమిటెడ్ రిలీజ్ మీద డీసెంట్ టాక్ తో తక్కువ టికెట్ రేట్స్ మీద ఈ స్థాయి వసూళ్లు అంటే కేవలం మెగాస్టార్ చిరంజీవి మాస్ అని అంటున్నారు అభిమానులు..ఇక ప్రతి సినిమాకి అతి కీలకంగా మారే సోమవారం టెస్ట్ ని కూడా ఈ చిత్రం విజయవంతంగా పూర్తి చేసుకుంది.

ఈ రోజు సినిమాకి నూన్ షోస్ నుండే డీసెంట్ స్థాయి ఆక్యుపెన్సీలను రాబట్టి అందరిని ఆశ్చర్యపొయ్యేలా చేసింది..ఇక మాట్నీ షోస్ నుండి మళ్ళీ షరామామూలే..మెగాస్టార్ మాస్ బాటింగ్ మొదలైంది..ప్రస్తుతం సోమవారం నాడు ఈ సినిమాకి ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే కచ్చితంగా ఈ చిత్రం ఆరవ రోజు 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..ఇదే ట్రెండ్ ని ఈ వీకెండ్ వరుకు కొనసాగిస్తే కచ్చితంగా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.