Bigg Boss 6 Nominations: బిగ్ బాస్ సీజన్ 6 ఐదు వారాలు పూర్తి చేసుకొని ఆరవ వారంలో అడుగు పెట్టింది. టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగిన చలాకీ చంటి ఐదవ వారమే నిష్క్రమించి నిరాశపరిచాడు. ఆయన పూర్తి స్థాయిలో తన సత్తా చాటలేకపోయారు. కాంట్రవర్సీకి దూరంగా ఉంటూ మంచి తనం మైంటైన్ చేస్తున్న చంటి తీరు నిర్వాహకులకు నచ్చినట్లు లేదు. అలాగే చంటి హోస్ట్ నాగార్జునతో నేను ప్లాప్ అంటూ ఒప్పుకున్నాడు. స్పైసీ కంటెంట్ ఇవ్వలేని చంటిని బయటికి పంపడానికి బిగ్ బాస్ కి కారణం దొరికింది. ఇనయా, చంటిలలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా హౌస్ లో ప్రేమాయణం నడుపుతున్న ఇనయాను సేవ్ చేసి చంటి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు.

ఇక సోమవారం నామినేషన్స్ డే కావడంతో హౌస్ హీటెక్కింది. కంటెస్టెంట్స్ మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్ ముఖాన ఫోమ్ రాసి, కారణాలు చెప్పి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. కంటెస్టెంట్స్ తమ తమ కారణాలతో ఇద్దరిద్దరు కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆదిరెడ్డి-రోహిత్ మధ్య పెద్ద గొడవైంది. సుదీపతో ఫైమా వాదనకు దిగారు.
హౌస్ లో మెజారిటీ కంటెస్టెంట్స్ ఆదిరెడ్డి, గీతూలను నామినేట్ చేశారు. బహుశా వారు స్ట్రాంగ్ ప్లేయర్స్ గా భావిస్తూ ఉండవచ్చు. లేదా వారిద్దరి గేమ్, ప్రవర్తన, మాట తీరు నచ్చకపోవచ్చు. కీర్తి, బాల ఆదిత్యలను కూడా ఎక్కువ మంది నామినేట్ చేయడం జరిగింది. కంటెస్టెంట్స్ వాసంతి, సూర్యలను ఒక్కరు కూడా నామినేట్ చేయకపోవడం విశేషం. ఈ నామినేషన్ ప్రక్రియలో ఎక్కువ ఓట్లు వచ్చిన తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కి నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు.

బాల ఆదిత్య, ఆది రెడ్డి, గీతూ, శ్రీహాన్, సుదీప, రాజ్, కీర్తి, శ్రీసత్య, మెరీనా 6వ వారానికి నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చే వారం హౌస్ వీడనున్నారు. సెప్టెంబర్ 4న బిగ్ బాస్ షో 21 మంది కంటెస్టెంట్స్ తో మొదలైంది. మొదటి వారం ఎలాంటి నామినేషన్ లేదు. కానీ రెండవ వారం షాని, అభినయశ్రీలను ఎలిమినేట్ చేశారు. ఇక మూడవ వారం నేహా చౌదరి, నాలుగవ వారం ఆరోహి రావు ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం చంటి హౌస్ ని వీడిన విషయం తెలిసిందే.