https://oktelugu.com/

Godfather 5 Days Collections: ‘గాడ్ ఫాదర్ ‘ 5 రోజుల వసూళ్లు..లిమిటెడ్ థియేటర్స్ తో అరాచకం సృష్టించిన మెగాస్టార్

Godfather 5 Days Collections: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇటీవలే ఘనంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ ముందుకి దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఏడాది ఆచార్య సినిమా అభిమానులను నిరాశపరిచిన మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా తో వాళ్లలో సరికొత్త జోష్ ని నింపాడు..అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన గాడ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : October 10, 2022 / 08:19 AM IST
    Follow us on

    Godfather 5 Days Collections: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇటీవలే ఘనంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ ముందుకి దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఏడాది ఆచార్య సినిమా అభిమానులను నిరాశపరిచిన మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా తో వాళ్లలో సరికొత్త జోష్ ని నింపాడు..అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన గాడ్ ఫాదర్ తోనే మెగాస్టార్ ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ విద్వాంసం సృష్టిస్తే ఇక వచ్చే ఏడాది పొంగల్ కానుకగా రాబొయ్యే కమర్షియల్ ఎంటర్టైనర్ తో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో అని మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు..మొదటి రోజు నుండి 5 వ రోజు వరుకు ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు చూస్తుంటే మెగాస్టార్ క్రేజ్ అంత పెద్ద ఫ్లాప్ తర్వాత కూడా ఇసుమంత కూడా తగ్గలేదని అర్థం అవుతుంది.

    megastar chiranjeevi

    మొదటి రోజు సుమారుగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా 13 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యగా, రెండవ రోజు 7 కోట్ల 70 లక్షల రూపాయిలు , మూడవ రోజున 6 కోట్ల రూపాయిలు, నాల్గవ రోజున 5 కోట్ల 50 లక్షల రూపాయిలు,ఐదవ రోజున 5 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ఇది చిరంజీవి గారి రేంజ్ వసూళ్లు కాదు..ఎందుకంటే ఆయన హీరో గా నటించిన గత చిత్రం ఆచార్య అట్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా మొదటి రోజు సుమారు గా 29 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఎందుకంటే ఆచార్య సమయం లో థియేటర్స్ భారీ గా ఉన్నాయి మరియు టికెట్ రేట్స్ కూడా ఎక్కువే..కానీ గాడ్ ఫాదర్ సినిమాకి ఆ రెండు లేవు..అందుకే మెగాస్టార్ రేంజ్ వసూళ్లు కావని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

    megastar chiranjeevi

    కానీ ఈ సినిమాకి లాంగ్ రన్ కచ్చితంగా ఉంటుందని వీకెండ్ వసూళ్ల ట్రెండ్ ని చూసి చెప్పొచ్చు..కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..చూడాలి మరి ఈ సినిమా రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

    Tags