https://oktelugu.com/

Swathi Muthyam Collections: బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిన స్వాతి ముత్యం..ఎంత వసూళ్లను రాబట్టిందో తెలుసా..?

Swathi Muthyam Collections: ప్రతి ఏడాది దసరా మరియు సంక్రాంతికి కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి చెయ్యడం సర్వసాధారణం..బాగున్నా సినిమాలకు ఈ రెండు పండగ సీసన్స్ లో వచ్చినప్పుడు బాక్స్ ఆఫీస్ కళకళలాడుతాయి..కానీ ఈ దసరా పండుగకి విడుదలైన సినిమాలలో కేవలం గాడ్ ఫాదర్ చిత్రం మినహా మిగిలిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టాయి..పోనీ ఈ రెండు సినిమాలు బాగాలేక ఫ్లాప్ అయ్యాయా అంటే అదీ కాదు..ఘోస్ట్ సినిమాకి యావరేజి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : October 10, 2022 / 08:13 AM IST
    Follow us on

    Swathi Muthyam Collections: ప్రతి ఏడాది దసరా మరియు సంక్రాంతికి కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి చెయ్యడం సర్వసాధారణం..బాగున్నా సినిమాలకు ఈ రెండు పండగ సీసన్స్ లో వచ్చినప్పుడు బాక్స్ ఆఫీస్ కళకళలాడుతాయి..కానీ ఈ దసరా పండుగకి విడుదలైన సినిమాలలో కేవలం గాడ్ ఫాదర్ చిత్రం మినహా మిగిలిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టాయి..పోనీ ఈ రెండు సినిమాలు బాగాలేక ఫ్లాప్ అయ్యాయా అంటే అదీ కాదు..ఘోస్ట్ సినిమాకి యావరేజి టాక్ రాగా,స్వాతి ముత్యం సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది..ఘోస్ట్ సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయో మనకి తెలిసిందే..కానీ స్వాతి ముత్యం సినిమా కలెక్షన్స్ గురించి ఎవరికీ తెలియదు..ఎవ్వరు ఆ సినిమా వసూళ్లను పట్టించుకోవడం లేదు కూడా..కానీ మాకు అందిన కొన్ని ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం స్వాతి ముత్యం నాలుగు రోజుల వసూళ్ల వివరాలను మీ ముందు పెడుతున్నాము..ఈ చిత్రం ద్వారా బెల్లంకొండ సురేష్ గారి రెండవ కుమారుడు బెల్లంకొండ గణేష్ ఇండస్ట్రీ పరిచయమైనా సంగతి మన అందరికి తెలిసిందే.

    bellamkonda ganesh

    లుక్స్ పరంగా మరియు యాక్టింగ్ పరంగా ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే రేంజ్ మార్కులు కొట్టేసిన బెల్లంకొండా గణేష్, హిట్ మాత్రం కొట్టలేకపొయ్యాడు..మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కూడా వసూళ్ల పరంగా మాత్రం కనీస స్థాయిలో కూడా రాబట్టలేకపోయింది..ఇప్పటి వరుకు ఈ చిత్రానికి కేవలం 60 లక్షల రూపాయిల షేర్ మాత్రమే వచ్చింది..ఈ చిత్రాన్ని భీమ్లా నాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సంగతి మన అందరికి తెలిసిందే.

    bellamkonda ganesh

    ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న బ్యానర్ ఇది..ఆ బ్యానర్ బ్రాండ్ ఇమేజి ని కూడా వాడుకోలేకపోయింది ఈ చిత్రం..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల రూపాయలకు జరగగా కనీసం ప్రింట్ ఖర్చులను కూడా వసూలు చెయ్యలేకపోయింది ఈ చిత్రం..బెల్లంకొండ గణేష్ అన్నయ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన మొదటి సినిమా ‘అల్లుడు శ్రీను’ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇండస్ట్రీ లో స్థిరపడిపోయారు..కానీ బెల్లంకొండ గణేష్ మొదటి సినిమాకే ఈ స్థాయి వసూళ్లు రావడం నిజంగా బాధాకరమే.

    Tags