https://oktelugu.com/

Chiranjeevi Flop Movies: చిరంజీవి కెరీర్ లో మొదటిరోజే దెబ్బతీసిన సినిమాలు ఇవీ

చిరంజీవి రోజా హీరో హీరోయిన్లుగా విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన బిగ్ బాస్ సినిమా మొదటి రోజే డిజాస్టర్ టాక్ అందుకుంది.

Written By: , Updated On : August 12, 2023 / 01:59 PM IST
Chiranjeevi Flop Movies

Chiranjeevi Flop Movies

Follow us on

Chiranjeevi Flop Movies: టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోగా టాలీవుడ్ ని ఏలిన చిరంజీవి ఈ మధ్యనే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో కొంత ఫ్లాప్ సినిమాలు అందుకున్న చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే చిరంజీవి కరియర్ లోనే విడుదలైన మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి.. అవేంటో చూద్దాం..

1. ఆచార్య:

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో చతికిలబడింది.

2. సై రా నరసింహ రెడ్డి:

రామ్ చరణ్ నిర్మాణంలో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి కూడా నిర్మాతలకు 30 కోట్ల నష్టం తెచ్చిపెట్టింది.

3. శంకర్ దాదా జిందాబాద్:

సూపర్ హిట్ అయిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాకి సీక్వల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గానే నిలిచింది.

4. బిగ్ బాస్:

చిరంజీవి రోజా హీరో హీరోయిన్లుగా విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన బిగ్ బాస్ సినిమా మొదటి రోజే డిజాస్టర్ టాక్ అందుకుంది.

5. రిక్షావోడు

చిరంజీవి రోజా నగ్మా సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా రిక్షావోడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.

6. రాజా విక్రమార్క:

చిరంజీవి హీరోగా రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన రాజా విక్రమార్క సినిమాలో అమల మరియు రాధిక హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.

ఈ సినిమాలు మాత్రమే కాకుండా చిరు హీరోగా నటించిన అంజి, మృగరాజు, జేబుదొంగ, త్రినేత్రుడు, లంకేశ్వరుడు, రుద్రనేత్ర, వంటి సినిమాలు కూడా మొదటి రోజే డిజాస్టర్లు గా నిలిచాయి.