Jailer- Balakrishna: జైలర్ తో రజినీకాంత్ హిట్ దాహం తీరింది. 2023 సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా జైలర్ అవతరించనుంది. ఈ చిత్ర వసూళ్లు రెండు రోజుల్లో వంద కోట్లు దాటేశాయి. వీకెండ్ ముగిసే నాటికి రెండు వందల కోట్ల మార్కు చేరుకోవడం ఖాయం. అలాగే ఇండిపెండెన్స్ డే కూడా కలిసి రానుంది. లాంగ్ వీకెండ్ లభించిన నేపథ్యంలో జైలర్ అద్భుతాలు చేయనుంది. బీస్ట్ మూవీతో విమర్శలపాలైన దర్శకుడు నెల్సన్ కమ్ బ్యాక్ అయ్యాడు. భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఈ మూవీలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ గెస్ట్ రోల్స్ చేశారు.
వారి ప్రెజెన్స్ సినిమాకు ప్లస్ అయ్యింది. అయితే ఈ మూవీలో బాలకృష్ణ కోసం నెల్సన్ ఓ పాత్ర అనుకున్నారట. మలయాళ, కన్నడ పరిశ్రమలకు చెందిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ నటించగా తెలుగు నుండి బాలయ్య ఎంపిక చేయాలనుకున్నారట. ఓ పవర్ ఫుల్ పోలీస్ పాత్ర బాలయ్య కోసం రాయాలనుకున్నారట. అయితే బాలయ్య ఇమేజ్ కి తగ్గట్లు ఆ పాత్రను డిజైన్ చేయలేకపోయాడట. అందుకే బాలయ్య జైలర్ లో నటించలేదని నెల్సన్ అన్నారు.
ఆయన పాత్ర పరిపూర్ణంగా రాయలేకపోయాను. అందుకే బాలయ్యను నేను సంప్రదించలేదు. ఆయన చేసేవారో కాదో తెలియదు కానీ… జైలర్ లో ఓ పాత్ర ఆయన కోసం అనుకున్నానని నెల్సన్ చెప్పుకొచ్చారు. ఒకవేళ బాలయ్య గెస్ట్ రోల్ చేసి ఉంటే సినిమాకు మరింత ప్లస్ అయ్యేది. తెలుగులో ఇంకా మెరుగైన వసూళ్లు జైలర్ సాధించేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గెస్ట్ రోల్స్ చేసింది. కెరీర్ బిగినింగ్ లో నాన్న ఎన్టీఆర్ చిత్రాలలో మాత్రమే ఆయన గెస్ట్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్ చేశారు. కృష్ణ, కృష్ణంరాజుతో ఒక మల్టీస్టారర్ చేశారు. ఇక జైలర్ ఆగస్టు 10న వరల్డ్ వైడ్ విడుదలైంది. రమ్యకృష్ణ, తమన్నా, యోగిబాబు, సునీల్ వంటి స్టార్ క్యాస్ట్ నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. అనిరుధ్ మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.