Megastar Chiranjeevi: టాలీవుడ్ కి సంక్రాంతి సీజన్ ఒక వరం లాంటిది అనుకోవచ్చు. కాస్త యావరేజ్ టాక్ వచ్చినా చాలు, పాన్ ఇండియన్ సినిమాల రికార్డ్స్ ని సైతం బద్దలు కొట్టేంత స్టామినా ఈ సీజన్ సొంతం. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ లాంటి మామూలు కమర్షియల్ సినిమా దేవర, ఓజీ, సలార్ వంటి పాన్ ఇండియన్ సూపర్ హిట్ సినిమాల కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో అవలీలగా దాటేస్తుందని ఎవరైనా ఊహించామా..?, కానీ దాటేసిందిగా..అందుకే ఈ సీజన్ టాలీవుడ్ కి ఒక వరం లాంటిది అని వర్ణించాల్సి వచ్చింది. ‘రాజా సాబ్’ చిత్రం అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయినప్పటికీ కూడా సంక్రాంతి సీజన్ అవ్వడం తో అవలీల గా 200 కోట్ల గ్రాస్ మార్కుని దాటేసింది అంటే, అది సంక్రాంతి మహిమ అనే అనాలి.
అందుకే ఈ సీజన్ కోసం టాలీవుడ్ లో ప్రస్తుతం పీక్ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా సీనియర్ హీరోలు అయితే అసలు వదులుకునే ఉద్దేశ్యం లో లేరు. వారిలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటాడు. రీ ఎంట్రీ తర్వాత ఆయన కెరీర్ భారీ వసూళ్లను రాబట్టిన సినిమాలు సంక్రాంతి సీజన్ లోనే వచ్చాయి. అందుకే త్వరలో ఆయన డైరెక్టర్ బాబీ తో చేయబోతున్న సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతుందని అందరూ ప్రచారం చేశారు. చిరంజీవి, బాబీ ఆలోచన కూడా ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చెయ్యాలనే. కానీ ఆ చిత్రాన్ని నిర్మించబోయే నిర్మాణ సంస్థ ‘KVN ప్రొడక్షన్స్’ ఆర్ధిక నష్టాల్లో ఉంది. ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కూడా కనిపించడం లేదు. పైగా చిరంజీవి కి మోకాళ్ళ సర్జరీ జరగడం తో కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో కొంత కాలం వరకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభాన్ని హోల్డ్ లో పెట్టారు.
అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల ఉగాది సందర్భంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదంటే మే వరకు ఆగాల్సిందే. ఈ చిత్రం లో చిరంజీవి 60 ఏళ్ళ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మలయాళం బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. విశ్వ సుందరి ఐశ్వర్య రాయి బచ్చన్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే మరో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని అంటున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని మెగాస్టార్ కి అందించిన డైరెక్టర్ బాబీ, ఈ చిత్రం తో అదే రేంజ్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.