Megastar’s Acharya Release: మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ గా నాలుగు సినిమాల నుండి అదిరిపోయే అప్ డేట్స్ వచ్చాయి, మెగా ఫ్యాన్స్ అద్భుతంగా సర్ ప్రైజ్ కి గురి అయ్యారు. అంతా బాగానే ఉంది, కానీ అందరూ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఒకే ఒక్క దాని కోసం, అదే ఆచార్య సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అని ? అదేంటో అన్నీ చెప్పారు గాని, ఆచార్య రాక గురించి మాత్రం ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు.
‘భోళాశంకర్’ సినిమా నుండి మెగాస్టార్ – కీర్తి సురేష్ కలయికలో వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇక ‘గాడ్ ఫాదర్’ అంటూ మెగాస్టార్ స్టైలిష్ మోషన్ పోస్టర్ ను వదిలారు. అలాగే బాబీ డైరెక్షన్ లో రానున్న మరో సినిమా పోస్టర్ కూడా వచ్చింది. మరి ఆచార్య రిలీజ్ గురించి ఎందుకు ఇంకా డేట్ ను ఫిక్స్ చేయలేదో చిత్రబృందం కూడా స్పష్టం చేసే ప్రయత్నం చేయలేదు.
“ఆచార్య” టీం ఉద్దేశ్యం ఏమిటి ? దసరాకి ఈ సినిమా రాబోతుంది అంటూ ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కానీ ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందనేదే ఎవరికీ అర్ధం కావడం లేదు. మరోపక్క ఆచార్య టార్గెట్ సంక్రాంతి 2022 అంటున్నారు. ఆచార్య షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయినట్లే.
కాబట్టి.. ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తే దసరాకి సినిమాని రిలీజ్ చెయ్యొచ్చు. కాకపోతే ఏపీలో థియేటర్స్ సమస్య ఇప్పట్లో తీరేలా లేదు. ఒకవేళ టికెట్ రేట్లు పెంచినా.. జనం థియేటర్స్ కి వచ్చేలా లేరు. ఏపీలో ఇంకా కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అందుకే ఆచార్య టీం సంక్రాంతి వైపే ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని టాక్.
కాకపోతే సంక్రాంతికి మహేష్ ‘సర్కారు వారి పాట’ రెడీగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” కూడా రేసులో ఉంది. ఇవి కాకుండా రెండు మూడు సినిమాలు కూడా ఉన్నాయి. మరి, ఈ లెక్కన సంక్రాంతికి “ఆచార్య” రాకపోవడమే అన్ని విధాలుగా అందరికీ మంచిది.