Megastar 158 movie: చిరంజీవి హీరోగా చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుందని చాలా మంది దర్శకులు చెబుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఆయన సీనియర్ హీరో కాబట్టి తనకున్న అనుభవంతో తనకు తోచిన సజెషన్స్ అయితే ఇస్తుంటాడట. ఆ సినిమాకి సరిపడా సజెషన్స్ ఇస్తే దర్శకుడు తీసుకుంటే పర్లేదు. తీసుకోకపోతే ఆయన కామ్ గా ఉండిపోతాడట. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం బాబీ తో చేస్తున్న సినిమా విషయంలో కూడా చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువవుతుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి చిరంజీవి ఇచ్చే సజెషన్ చాలా వాల్యుబుల్ గా ఉంటాయని ఇంతకుముందు అతనితో పని చేసిన చాలా మంది దర్శకులు చెప్పారు. ముఖ్యంగా ఆయన చెప్పే పాయింట్స్ తో సినిమా మొత్తాన్ని మార్చేయొచ్చు అంటూ గతంలో ఆయనతో సినిమా చేసిన అనిల్ రావిపూడి చెప్పడం విశేషం…
‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ ని పెట్టమని చెప్పింది కూడా చిరంజీవి గారే అంటు అనిల్ రావిపూడి ఒక ప్రెస్ మీట్ లో చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు చిరంజీవికి ఒక బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందించాడు. ఇక ఇప్పుడు బాబీ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా విషయంలో కూడా చిరంజీవి కొన్ని ఇన్ పుట్స్ అయితే ఇస్తున్నారట.
మరి బాబీ వాటిని తన స్టైల్లో కి మార్చి మార్పులు చేర్పులు చేసి చిరంజీవిని కొత్తగా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి ఇప్పుడు భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. మన శంకర్ వరప్రసాద్ సినిమా 400 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.
కాబట్టి ఇప్పుడు చేయబోతున్న సినిమాలు అంతకుమించిన వసూలు రాబట్టినప్పుడు మాత్రమే చిరంజీవి టాప్ లెవెల్ కి వెళ్తాడు. లేకపోతే మాత్రం మరోసారి ఆయన డిసపాయింట్ అవ్వడం పక్క అంటూ అతని అభిమానులు సైతం ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు…