Homeఎంటర్టైన్మెంట్Mega158: #Mega158 ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రానున్న పవన్ కళ్యాణ్..

Mega158: #Mega158 ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రానున్న పవన్ కళ్యాణ్..

Mega158: ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ ఇండస్ట్రీ హిట్ తర్వాత , మెగాస్టార్ చిరంజీవి(MEgastar Chiranjeevi) , డైరెక్టర్ బాబీ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎప్పుడో జనవరి నెలలోనే జరగాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల , ఇన్ని రోజులు ఆగిపోయింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు ఈ నెల 10 న జరగబోతుంది. ఈ సందర్భంగా […]

Mega158: ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ ఇండస్ట్రీ హిట్ తర్వాత , మెగాస్టార్ చిరంజీవి(MEgastar Chiranjeevi) , డైరెక్టర్ బాబీ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎప్పుడో జనవరి నెలలోనే జరగాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల , ఇన్ని రోజులు ఆగిపోయింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు ఈ నెల 10 న జరగబోతుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత లోకేష్ , డైరెక్టర్ బాబీ కలిసి నేడు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ని కలిసి , ముఖుర్తం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆహ్వానం పలికారు. ఆయన్ని కలిసిన తర్వాత వీళ్లిద్దరు సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియా లో అప్లోడ్ చేయడం బాగా వైరల్ అయ్యింది.

చాలా కాలం తర్వాత చిరంజీవి , పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఈవెంట్ లో పాల్గొనబోతుండడం తో మెగా అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ఎప్పుడెప్పుడు వీళ్లిద్దరు కలిసిన ఫోటోలు సోషల్ మీడియా లోకి వస్తాయా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక #Mega158 విశేషాల్లోకి వెళ్తే, ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు . అనురాగ్ కశ్యప్ ఇందులో విలన్ గా నటించబోతుండగా , మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదంతా పక్కన pedite ee చిత్రం లో చిరంజీవి కి కూతురు పాత్ర కోసం చాలా మంది హీరోయిన్లను సంప్రదించారు , చివరికి మలయాళం క్యూట్ బ్యూటీ అనశ్వర రాజన్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈమె మన టాలీవుడ్ లోకి శ్రీకాంత్ కొడుకు హీరోగా నటించిన ‘ఛాంపియన్’ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కానీ, తమిళం లో చేసిన ‘#Withlove ‘ చిత్రం మాత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది.

ఈమె కూడా ఎల్లుండి జరగబోయే పూజ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి కి జోడీగా ఎవరు నటించబోతున్నారు అనేదానిపై ప్రస్తుతం సస్పెన్స్ నడుస్తోంది. చాలా మంది ఐశ్వర్య రాయ్ నటించబోతుందని చెప్పుకొచ్చారు , కానీ ప్రియమణి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఖరారు అవ్వడం మాత్రం పక్కా, ఎవరు అనేది మాత్రం ఎల్లుండి వరకు సస్పెన్స్. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాని కేవలం తెలుగు లోనే కాదు , హిందీ, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper