https://oktelugu.com/

Bhola Shankar Movie: మెగాస్టార్ చిరంజీవి “భోళా శంకర్” పూజా కార్యక్రమాలు షురూ…

Bhola Shankar Movie: మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు చిరు. ఇక బాబీ డైరెక్షన్ లో తన 154 వ సినిమాకు పూజ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇప్పుడు తాజాగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ఓ సినిమా ను చేస్తున్నాడు మెగాస్టార్‌. ఈ సినిమా కు.  “బోళా శంకర్‌” అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేస్తూ గతంలో పోస్టర్ లను రిలీజ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 11, 2021 / 11:23 AM IST
    Follow us on

    Bhola Shankar Movie: మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు చిరు. ఇక బాబీ డైరెక్షన్ లో తన 154 వ సినిమాకు పూజ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇప్పుడు తాజాగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ఓ సినిమా ను చేస్తున్నాడు మెగాస్టార్‌. ఈ సినిమా కు.  “బోళా శంకర్‌” అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేస్తూ గతంలో పోస్టర్ లను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ నుంచి మరో బిగ్ అప్డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది.

    అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించింది చిత్ర బృందం. ఈ పూజా కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం 7.45 గంటలకు ప్రారంభించారు. ఇక కార్యక్రమంలో చిత్ర బృందం సభ్యులతో పాటు చిరంజీవి, తమన్నా కు హాజరయ్యారు. ఇక ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. అలానే ఈ సినిమాను అనిల్‌ సుంకర్‌ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కిర్తీ సురేష్‌ చిరంజీవికి చెల్లెలి గా నటించనుంది. తమన్నా హీరోయిన్‌ గా చేస్తున్న ఈ మూవీ… తమిళంలో అజిత్ నటించిన “వేదాళం” కు రీమేక్‌ గా తెరకెక్కుతోంది.

    https://twitter.com/AKentsOfficial/status/1458642744943939589?s=20

    ఈ సినిమా కోసం రెండు రోజుల క్రితమే లుక్ టెస్ట్ ను పూర్తి చేశారు చిరంజీవి. ఓ స్పెషల్ లుక్ లో చిరంజీవిపై ఫోటోషూట్ ను నిర్వహించారు. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్శకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.