https://oktelugu.com/

SBI: ఎస్బీఐ ఖాతాదారులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ.2 లక్షల భీమా?

SBI: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తీపికబురు అందించింది. ఎస్బీఐ ఖాతాదారులు ఏకంగా 2 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైతే ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ తెరుస్తారో వాళ్లు మాత్రమే ఈ బెనిఫిట్ ను పొందే అవకాశం ఉంటుంది. గతంలో జన్ ధన్ అకౌంట్ ను ఓపెన్ చేసిన చేసిన వాళ్లు ఈ బెనిఫిట్ ను పొందడానికి అర్హులని చెప్పవచ్చు. ఈ స్కీమ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 11, 2021 11:39 am
    Follow us on

    SBI: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తీపికబురు అందించింది. ఎస్బీఐ ఖాతాదారులు ఏకంగా 2 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైతే ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ తెరుస్తారో వాళ్లు మాత్రమే ఈ బెనిఫిట్ ను పొందే అవకాశం ఉంటుంది. గతంలో జన్ ధన్ అకౌంట్ ను ఓపెన్ చేసిన చేసిన వాళ్లు ఈ బెనిఫిట్ ను పొందడానికి అర్హులని చెప్పవచ్చు.

    ఈ స్కీమ్ వల్ల పాత కస్టమర్లకు లక్ష రూపాయల వరకు బీమా అందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎస్బీఐ పాత కస్టమర్లు లక్ష రూపాయల వరకు బీమా ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నామినీలు క్లెయిమ్ చేయాలనుకునే వ్యక్తి మరణ ధృవీకరణ పత్రం ద్వారా స్కీమ్ కు సంబంధించిన బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. మరణ నివేదిక, ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు, ఆధార్‌ కార్డు కాపీని సమర్పించడం ద్వారా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

    2014 సంవత్సరంలో పేదలు బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉండాలనే సదుద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని మొదలుపెట్టింది. బలహీన వర్గాలు, తక్కువ ఆదాయ వర్గాలకు బీమా, పెన్షన్ ఇతర ప్రయోజనాలను చేకూర్చటానికి కేంద్రం ప్రాధాన్యతను ఇస్తుండటం గమనార్హం. ప్రాథమిక బ్యాంకింగ్ అకౌంట్ ఉన్న ప్రతి ఫ్యామిలీ ఈ స్కీమ్ ద్వారా వేర్వేరు బెనిఫిట్స్ కు అర్హత పొందే ఛాన్స్ ఉంటుంది.

    జన్ ధన్ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు లక్ష రూపాయల ఇన్ బిల్ట్ ప్రమాద బీమా కవరేజీని పొందే అవకాశం ఉంటుంది. కేంద్రం ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ స్కీమ్ ను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సైతం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం.

    Also Read: ప్రముఖ సంస్థలో టీచింగ్ ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.2 లక్షల వేతనంతో?

    ఏపీలో డిగ్రీ పాసైన మహిళలకు శుభవార్త.. రూ.71,500 వేతనంతో?