Game Changer Movie Review: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు తన సినిమాలతో సేవలను అందించి దిగ్గజ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న శంకర్…ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలతో పాన్ ఇండియా లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక గ్లోబల్ స్టార్ గా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా లేదా అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ప్రతి విషయానికి కోపానికి వచ్చే రామ్ నందన్ (రామ్ చరణ్) కాలేజీ సమయంలోనే అందరిని కొడుతూ ఉంటాడు. తన కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఇందులో భాగంగానే ఆయన ఐపిఎస్ ఆఫీసర్ గా విధులను నిర్వహించి ఆ తర్వాత రాజకీయ నాయకులతో పడలేక తను ప్రేమించిన అమ్మాయి కోసం ఐఏఎస్ ఆఫీసర్ అయి జనానికి సేవా చేయాలనుకుంటాడు.
ఇక ఇక్కడే ‘అభ్యుదయ పార్టీ’ అనే ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉన్న సీఎం సత్యమూర్తి కొడుకు అయిన మోపిదేవి (ఎస్ జే సూర్య) మంత్రిగా తన పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్న సందర్భంలో రామ్ నందన్ కి మోపిదేవికి మధ్య ఒక గొడవ అయితే జరుగుతుంది. మరి దీనివల్ల మోపిదేవి రామ్ నందన్ ని ఎలాంటి టార్చర్ పెట్టాడు. మోపిదేవి కి రామ్ నందన్ ఎలాంటి కౌంటర్స్ ఇస్తూ వచ్చాడు. రామ్ నందన్ పేరెంట్స్ కి సంభందించిన బ్యాక్ స్టోరీ ఏంటి దానివల్ల సినిమా ఎలాంటి మలుపులు తిరిగిందనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే సినిమా రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ లో ఈ మూవీ గురించి చెప్పినంత అయితే ఏమి లేదు. ఇక మొదట హీరో ఐఏఎస్ ఆఫీసర్ అయి జననైకి సేవ చేయాలనుకుంటాడు. అయితే సేవా అనేది చూపించిన దాఖలాలు అయితే లేవు. ఇక శంకర్ డైరెక్షన్ లో సినిమా అంటే యావత్ ప్రేక్షకులందరికి ఆసక్తి అయితే ఉంటుంది. కానీ ఇకమీదట శంకర్ సినిమాలు చేయకపోవడమే ఉత్తమం. రోజు రోజుకు ఆయన డౌన్ ఫాల్ అవుతున్నాడు. ఇక ఆయనకి సినిమాలు తీసే సత్తా లేదు..ఇక ఈ మూవీ కూడా ప్రేక్షకుడిని చాలా ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. హీరో క్యారెక్టరై జేషన్ లో క్లారిటీ లేదు. కథలో కాన్ ఫ్లిక్ట్ లేదు. అప్పుడే ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఇక అంతలోపే ఐపీఎస్ అంటాడు.
మళ్ళీ మధ్యలో సీఎం అంటాడు. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ అంటాడు… ఒక హీరోని ఇన్ని రకాల పాత్రల్లో చూపించినప్పుడు ఏ పాత్రికి తగ్గట్టుగా ఆ పాత్రలో ఆ క్యారెక్టరై జేషన్ బాగా రాసుకొని అందులో అతను చేయాల్సిన పనులేంటి చేసింది ఏంటి అనేది క్లారిటీగా చూపించే ప్రయత్నం చేయాలి… కానీ శంకర్ ఇవేమీ చేయకపోగా అసలు కథను ఏమాత్రం ఫాలో అవ్వకుండా ఎక్కడో స్టార్ట్ చేసి మరెక్కడో ఎండ్ చేసిన విధానం అయితే ఈ సినిమాలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక సినిమా మొత్తంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో వచ్చే అప్పన్న పాత్ర తాలూకు స్టోరీని మినహాయిస్తే సినిమాలో ఎక్కడా కూడా పెద్దగా మ్యాటర్ అయితే కనిపించదు… ఎస్ జే సూర్య క్యారెక్టర్ ని స్క్రీన్ మీద చూసినంటాక్ సేపు ఎంజాయ్ చేసినట్టుగా అనిపించినప్పటికి సినిమా అయిపోయిన తర్వాత ప్రతి క్యారెక్టర్ తో మనకి ఏం చెప్పాడు అనేది కూడా అంత క్లారిటీగా అర్థమవ్వదు.
అలాగే సినిమా చూసి వచ్చిన ప్రేక్షకుడికి హీరో క్యారెక్టర్ జైషన్ లో ఉన్న కన్ఫ్యూజన్స్ ఎక్కువగా బాధపెడుతూ ఉంటాయి. తద్వారా సినిమా అనేది ఒక వర్గం ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకోలేక పోయిందనే చెప్పాలి. నిజానికి స్క్రీన్ ప్లే ఫాల్ట్ ఎక్కువగా కనిపించింది. అలాగే క్యారెక్టర్ జైషన్ కి కన్ క్లూజన్ ఇవ్వడంలో కూడా శంకర్ చాలా వరకు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. భారతీయుడు 2 సినిమా ఫ్లాప్ అయినప్పటికి గేమ్ చేంజర్ సినిమా మీద ఎంతో కొంత ఆశతో చాలామంది జనాలు థియేటర్ కి అయితే వెళ్తున్నారు. కానీ వాళ్ల ఆశలను అడియాశలు చేస్తూ శంకర్ ఒక నాసిరకం కథతో ఒక ఒక క్వాలిటీ లేని ప్రొడక్ట్ ను సృష్టించి జనాల మీదకైతే వదిలాడు. ఇక దాదాపు 500 కోట్ల వరకు బడ్జెట్ పెట్టిన ఈ సినిమాలో ఆ బడ్జెట్ కూడా మనకు ఎక్కడ కనిపించదు.
ఇక ‘జరగండి ‘ అనే సాంగ్ కోసం విపరీతంగా ఖర్చు పెట్టమని చెప్పుకునే మేకర్స్ జరగండి సాంగ్ లో కూడా లిరికల్ సాంగ్ లో వదిలిన షాట్స్ ను మినహాయిస్తే మరొక మూడు నాలుగు షాట్స్ అదనంగా సినిమా థియేటర్లో కనిపిస్తాయి తప్ప పెద్దగా అయితే ఎక్కడ గొప్ప విజువల్స్ అయితే కనిపించవు…నిజానికి కథని ఫాలో అయి సినిమాను ముందుకు తీసుకెళ్తే ఈ భారీ హంగులు ఆర్భాటాలు ఉండాల్సిన అవసరం లేదు. అంత బడ్జెట్ ని కూడా పెట్టించాల్సిన పని ఉండదు. నిజానికి బడ్జెట్ పెంచాలి అనే ఉద్దేశ్యం తోనే అవసరం లేకపోయిన కూడా ఈ సినిమా మీద ఎక్కువ బడ్జెట్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. అంతే తప్ప కథలో ఎక్కడా కూడా మనకు బడ్జెట్ అయితే ఎక్కువగా పెట్టినట్టు కనిపించాడు. అసలు ఈ కథ అంత బడ్జెట్ ను కూడా డిమాండ్ చేయదు… ఇక శంకర్ ఈ సినిమాతో రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదని స్పష్టంగా తెలుస్తుంది. ‘భారతీయుడు 2’ సినిమా ఆయన పతనానికి మొదటి మెట్టు అయితే ఇది రెండో మెట్టుగా చెప్పుకోవచ్చు. ఇక సినిమాటోగ్రాఫర్ విషయానికి వస్తే ఇందులోని ప్రతి షాట్ లో ఎమోషన్ ని ఫాలో అవ్వకుండా కెమెరా మొత్తాన్ని తిప్పుతూనే ఉన్నాడు.
ఇక హీరో విలన్ కన్వర్ జేషన్ కూడా మధ్యలో కట్ అయినట్టుగా ఉంటుంది. ఇక ఆ ఎమోషన్ ని సస్టెయిన్ చేసే విధంగా కూడా లేకపోవడం వాటిని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇక సినిమాటోగ్రాఫర్ ఎందుకు ఏ షాట్ పెడుతున్నాడో చూసే ఆడియన్ కి కూడా విజువల్ గా ఎంతవరకు కనెక్ట్ కాకపోవడం ఇవన్నీ డ్రా బాక్స్ వల్లే గేమ్ చేంజర్ సినిమా చాలా లో క్వాలిటీ ప్రోడక్ట్ గా బయటికి అయితే వచ్చింది. ఇక అన్ని క్రాఫ్ట్ లకి సంబంధించి ఈ సినిమాలో మైనస్ లు అయితే ఉన్నాయి.
కథపరంగా అయితే చాలా వరకు లాజిక్ లేని సీన్స్ ని కూడా ఇందులో ఆడ్ చేయడం సగటు ప్రేక్షకుడికి తలకాయ నొప్పి గా మారింది… ఇక సునీల్ తో కామెడీ పండించే ప్రయత్నం అయితే చేశారు. కానీ అవేవీ పెద్దగా పేలలేదు. ఇక అలాగే డైలాగ్స్ కూడా పెద్దగా ప్రేక్షకులకు గుర్తుండిపోయే రేంజ్ లో అయితే లేవు. ఇక లవ్ స్టోరీ ఎపిసోడ్స్ అయితే చూస్తున్నంత సేపు ప్రతి ప్రేక్షకులకు చిరాకు పెట్టిస్తాయి. హీరోయిన్ పాత్ర కూడా పెద్దగా సినిమా చూసే ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే విధంగా అయితే లేకపోవడం చాలా దారుణమైన విషయమనే చెప్పాలి.
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ ఒక్కడే ఈ సినిమాని చేస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అంజలి క్యారెక్టర్ కూడా కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో రామ్ చరణ్ చాలా చక్కటి యాక్టింగ్ ను కనబరిచి సినిమా మీద కొంతవరకు హోప్ అయితే తీసుకొచ్చాడు… ఇక ఎస్ జె సూర్య తన విలక్షణమైన నటనతో నటించి మెప్పించే ప్రయత్నం చేసినా కూడా ఆయన క్యారెక్టర్ లో ఉన్న ఆర్క్ ను దర్శకుడు వాడుకోలేకపోయాడనే చెప్పాలి. అలాగే శ్రీకాంత్, రాజీవ్ కనకాల, సునీల్ లాంటి నటులు వాళ్ల పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొన్ని సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు. అలాగే సాంగ్స్ మీద కూడా ఆయన ఇచ్చిన మ్యూజిక్ కొంతవరకు వర్కౌట్ అయిందనే చెప్పాలి. కానీ సినిమా కోసం ఆయన పెద్దగా ఎఫర్ట్స్ పెట్టినట్టుగా అయితే కనిపించలేదు. ఇక నార్మల్ సినిమాకి ఇచ్చినట్టుగానే మ్యూజిక్ ని అందించాడు. మరి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వరకు ఎమోషన్ ని బిల్డ్ చేయడంలో చాలావరకు మైనస్ గా మారిందనే చెప్పాలి. ఇక సినిమాటోగ్రాఫర్ విషయానికి వస్తే ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే సినిమాలో చెప్పుకోదగ్గ ఒక్క షాట్ కూడా ప్రాపర్ గా లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
శంకర్ విజన్ కి తగ్గట్టుగా ఆయన విజువల్స్ ను అందించలేకపోయాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికి శంకర్ వాటిని చాలా వరకు దుర్వినియోగం చేశారనే చెప్పాలి. అనవసరమైన సన్నివేశాల కోసం హంగులు ఆర్భాటాలు చేయడం అనేది ఈ సినిమాకు భారీగా మైనస్ గా మారింది…
ప్లస్ పాయింట్స్
రామ్ చరణ్
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్
కథ
సినిమాటోగ్రఫీ
డైరెక్షన్
మ్యూజిక్
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.25/5
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Mega power star ram charan game changer movie review in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com