Ram Charan Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతి త్వరలోనే తండ్రి కాబోతున్నాడు అనే శుభవార్తని నేడు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ని వేదికగా చేసుకొని అభిమానులకు తెలిపిన సంగతి తెలిసిందే..సుమారు పదేళ్ల నుండి ఈ వార్త కోసం నిరీక్షిస్తున్న ఫ్యాన్స్ కి ఈ వార్త ఎంత సంతోషాన్ని కలిగించి ఉంటుందో ఊహించుకోవచ్చు..కానీ ఈ శుభ వార్త పై ఒక్క సెలబ్రిటీ కూడా కంగ్రాట్స్ చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది..మిగిలిన హీరోల సంగతి పక్కన పెడితే, మెగా హీరోలు కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు.

పవన్ కళ్యాణ్ ,అల్లు అర్జున్ , సాయి ధరమ్ తేజ్ మరియు వరుణ్ తేజ్ ఇలా అందరూ ట్విట్టర్ లో ఉన్నారు..కానీ ఒక్కరు కూడా రామ్ చరణ్ కి శుభాకాంక్షలు తెలియచెయ్యలేదు..దీనిపై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ మీద ఉన్నారు..ఏ హీరోకైనా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ప్రతీ ఒక్కరికి శుభాకాంక్షలు తెలియ చేసే సెలెబ్రిటీలు, రామ్ చరణ్ విషయం లో మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా చరణ్ ఎంతగానో అభిమానించే తన బాబాయ్ పవన్ కళ్యాణ్ నుండి శుభాకాంక్షలు ఆశించారు రామ్ చరణ్ ఫ్యాన్స్..కానీ ఆయన నుండి ఎలాంటి రెస్పాన్స్ రావడం తో కాస్త నిరాశకి గురైయ్యారు..పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏ చిన్న వార్త బయటకి వచ్చిన రామ్ చరణ్ అందరికంటే ముందుగా పవన్ కళ్యాణ్ కి విష్ చేస్తాడని..కానీ రామ్ చరణ్ జీవితం లో ఇంత ముఖ్యమైన ఘట్టం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ కనీస రెస్పాన్స్ ఇస్తాడని ఆశించామని రామ్ చరణ్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.
ఇక తనతో కలిసి మూడేళ్ళ పాటు ఒకే సినిమాలో పనిచేసిన జూనియర్ ఎన్టీఆర్ కూడా శుభాకాంక్షలు చెప్పకపోవడం పై రామ్ చరణ్ ఫ్యాన్స్ తప్పుబట్టారు..అయితే సొంత కుటుంబ సభ్యులు బహిరంగంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని..మెగా ఫ్యామిలీ లో అందరూ ఎంత అన్యోయంగా ఉంటారనేది అందరికి తెలుసనీ..సీనియర్ మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి సర్ది చెప్తున్నారు.